- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెట్రోలో సీటు కోసం ఇద్దరు ఆడోళ్ల మధ్య కొట్లాట..! (వీడియో)
దిశ,వెబ్‌డెస్క్ః పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో సీటు కోసం జరిగే వాదోపవాదాలు గొడవలో లేని బయట వ్యక్తులకు భలే కామెడీగా కనిపిస్తాయి. నిజానికి, సీటు గొడవలకు ఆడామగా తేడా ఉండదు గానీ, వాదనల్లో కనిపించే రీజన్లలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి ఓ సందర్భాన్ని చూపించే సంఘటన ఈసారి ఢిల్లీ మెట్రోలో జరిగింది. ట్విట్టర్లో పోస్ట్ అయిన ఈ వీడియో క్లిప్‌లో, పసుపు రంగు చీరలో ఉన్న స్త్రీ తన బ్యాగ్‌ను పక్కన పెట్టకొని ఖాళీ సీటుపై సౌకర్యవంతంగా కూర్చొని ఉండగా, ఆరెంజ్ రంగు కుర్తాలో ఉన్న మహిళ సీటు దొరక్క కష్టపడుతోంది. చీర కట్టుకున్న స్త్రీ తాను ఖాళీ సీటు ఇవ్వనని చెప్పడంతో గొడవ మొదలవుతుంది. ఇక, ఏమీ ఎరగనట్లు ఉన్న మరో యువతి తనకు పట్టనట్లు తన పక్కనుంచుకున్న బ్యాగ్‌ని కూడా తీయకుండా, అల్పాహారమేదో ఆరగిస్తూ ఉంటుంది.
నిజానికి, చీరలో ఉన్న మహిళ తన స్నేహితుల కోసం ఖాళీ సీటును బ్యాగ్ పెట్టి ఆపింది. ఇక, వాదోపవాదాలతో కొనసాగిన కొట్లాటలో సీటు దొరకని మహిళ, సెక్యూరిటీకి ఫిర్యాదు చేస్తానని చెబుతుంది. చీర కట్టుకున్న మహిళ చెప్పుకోమంటుంది. గమ్యాలు వచ్చేవరకూ ముగియని ఈ ఈగోలను చూసి నెటిజన్లు వీడియోను వైరల్ చేశారు. పక్కనున్న "ఆ బర్గర్ గర్ల్ లాగా జీవితంలో ప్రశాంతత కావాలి" అని కొందరు అంటుంటే, బాధ్యత లేకుండా ఉన్నా ఆమెను @OfficialDMRC ఈ మహిళపై చర్య తీసుకోవాలి అని ఒకరు మండిపడ్డారు. మరి ఈ గొడవ చూసి మీరేమంటారు..?!
ఇలా చేసే మగాళ్లు బెడ్ పైన బిస్కేటే.. మరి అలా చేస్తే, సూపరంట!!