నాద‌స్వ‌రానికి పాములొస్తాయ్‌.. మ‌రి ఈ హార్మోనికాకి ఏమొచ్చాయో చూడండి!

by Sumithra |
నాద‌స్వ‌రానికి పాములొస్తాయ్‌.. మ‌రి ఈ హార్మోనికాకి ఏమొచ్చాయో చూడండి!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ప్ర‌కృతిలో అన్నింటికీ ప్ర‌తి స్పందించే గుణం ఉంటుంది. ముఖ్యంగా భూమిపైన ప్ర‌తి జీవీ శ‌బ్దాన్ని సంగ్ర‌హిస్తుంది. అంత‌కుమించి, సంగీతానికి స్పందిస్తుంది. సాధార‌ణంగా, నాద స్వ‌రం ఊదితే, పాములు డ్యాన్స్ చేస్తాయిని వింటుంటాము. కానీ, ఇక్క‌డ‌ ఒక వృద్ధుడు రెండు బాతుల కోసం వినిపించిన సంగీతం, దానికి ప్ర‌తిస్పందించిన బాతుల స్పంద‌న‌ హృదయాన్ని కదిలిస్తుంది. ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్విట్ట‌ర్ ఖాతా Buitengebiedenలో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక‌ పార్క్‌లో కూర్చున్న వృద్దుడు హార్మోనికాపై తెరెసా టెంగ్ రాసిన 'ది మూన్ రిప్రజెంట్స్ మై హార్ట్' అనే పాటను ప్లే చేస్తుంటాడు. ఆ సంగీతానికి ఆకర్షితులైన రెండు పెద్దబాతులు ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వచ్చి, సంగీతాన్ని ఎంతో ఇష్టంగా ఆశ్వాదిస్తుంటాయి. చివ‌రికి, హృద్య‌మైన సంగీతం అందించిన‌ ఆ వ్యక్తిని కృత‌జ్ఞ‌త‌గా అలుముకుంటాయి. ట్యూన్‌కి తలలు ఊపుతూ, సంగీతంతో స్వ‌రం క‌లిపే ఈ బాతులు నెటిజ‌న్ల‌ను సంబ‌రానికి గురిచేస్తున్నాయి. మీరూ చూడండి..

Advertisement

Next Story

Most Viewed