పెళ్లి మండ‌పంలోనే మీద‌ప‌డి కొట్టుకున్న వ‌ధువ‌రులు (వీడియో)

by Sumithra |   ( Updated:2023-06-13 15:32:01.0  )
పెళ్లి మండ‌పంలోనే మీద‌ప‌డి కొట్టుకున్న వ‌ధువ‌రులు (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః త‌మాషా పెళ్లి వీడియోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైర‌ల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోల్లో విష‌యం ఎలాగున్నా ఇవి నెటిజ‌నుల‌ను రంజింపజేస్తున్నాయి. అయితే, అన్ని వివాహాలు అనుకున్నంత అల‌రించ‌వు, ప్ర‌శాంతంగా, సంతోషంగా ముగియ‌వు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది. ఒక జంట తమ పెళ్లి మండపం పైన స‌ర‌దాగా మొద‌లై మీద‌ప‌డి కొట్టుకునే వ‌ర‌కూ వెళ్లింది. వధువు వరుడిపై ప‌డి ర‌చ్చ చేస్తుంది. చుట్టుపక్కల వారు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే, ఈ గొడవ వెనుక కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. నెటిజనులు కూడా కార‌ణం తెలియ‌క త‌ల‌గోక్కున్నారు. మరికొందరు ఈ ఫైటింగ్‌కి నిజంగా కారణమేంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తి చూపించారు. మొత్తానికి, ఈ ర‌చ్చ‌కు రీజ‌న్ తెలియ‌క‌పోయినా ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ల‌తో నిండుతోంది. మీరూ చూడండి.

Advertisement

Next Story

Most Viewed