సెల్ఫ్ టాక్.. ఒత్తిడి, సవాళ్లు ఎదుర్కోవడంలో కీలకపాత్ర

by Seetharam |
సెల్ఫ్ టాక్.. ఒత్తిడి, సవాళ్లు ఎదుర్కోవడంలో కీలకపాత్ర
X

దిశ, ఫీచర్స్: మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని పెద్దలు చెప్తుంటారు. అందుకే మన గురించి మనం ఆలోచించే విధానం పాజిటివ్‌గా ఉండాలని సూచిస్తుంటారు. ఈ క్రమంలోనే సెల్ఫ్ టాక్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తున్నారు నిపుణులు. మనతో మనం కమ్యూనికేట్ అయ్యేందుకు చేసే సహజమైన అభిజ్ఞా ప్రక్రియను సెల్ఫ్ టాక్ లేదా స్వీయ చర్చ అని పిలుస్తారంటున్న ఎక్స్‌పర్ట్స్.. ఎమోషన్ రెగ్యులేషన్‌లో అద్భుతంగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.

సవాళ్లు, ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో స్వీయ చర్చలో పాల్గొన్నట్లయితే మరింత శక్తిని పొందేందుకు, కష్టాలను అధిగమించేందుకు పవర్‌ఫుల్ టూల్‌గా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కాన్షియస్ బిలీఫ్స్(చేతన నమ్మకాలు), అపస్మారక ఆలోచనలు, పక్షపాతాన్ని మిళితం చేస్తూ పరిస్థితులను మన కంట్రోల్‌లో ఉంచుతాయని తెలిపారు.

పాజిటివ్ వర్సెస్ నెగెటివ్ సెల్ఫ్ టాక్ :

సెల్ఫ్ టాక్ అనేది పాజిటివ్ / నెగెటివ్‌గా ఉంటూ.. భావోద్వేగాలు మరియు మానసిక స్థితిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. సానుకూల స్వీయ చర్చ ఉత్తేజాన్ని, ప్రేరణను కలిగిస్తుంది. మరింత నమ్మకం, పట్టుదలతో ముందుకు సాగడానికి అద్భుతమైన శక్తిగా సాయపడుతుంది. పరీక్షలకు ముందు పాజిటివ్ సెల్ఫ్ టాక్‌లో పాల్గొనడం వల్ల ఆందోళన తగ్గుతుందని.. అథ్లెట్స్‌ ఆట తీరులో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుందని అధ్యయనం కనుగొంది. క్రీడలో నిమగ్నమై ఉండేందుకు, ప్రదర్శన చేస్తున్నప్పుడు జోష్ నింపేందుకు సాయపడుతుందని నిర్ధారించింది.

మరోవైపు ప్రతికూల స్వీయ చర్చ(నెగెటివ్ సెల్ఫ్ టాక్) పూర్తిగా వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్‌‌పై ప్రతికూల ప్రభావం చూపుతూ.. కన్ఫర్మేషన్ బయాస్ కారణంగా తరచుగా పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారుతాయి. వాస్తవానికి ఓవర్ జనరలైజేషన్, అనవసరమైన అదృష్టంతో కూడిన ప్రతికూల స్వీయ చర్చలు.. మూడ్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. డిప్రెషన్ లేదా యాంగ్జయిటీ ఉన్న వ్యక్తులు క్రమం తప్పకుండా ప్రతికూల స్వీయ చర్చలో పాల్గొంటారని పరిశోధనలు సూచిస్తున్నాయి.

అంటే ఒక వ్యక్తి యొక్క శ్రేయస్సులో సెల్ఫ్ టాక్ కీలక పాత్ర పోషిస్తుంది. దానిపై శ్రద్ధ చూపడం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో పాజిటివ్ లేదా నెగెటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఇతర అలవాట్ల మాదిరిగానే ఒక హ్యాబిట్‌గా మారిపోతుంది. అందుకే సెల్ఫ్ టాక్ ప్రోత్సహించేందుకు పలు టిప్స్ అందిస్తున్నారు నిపుణులు.

1. సెల్ఫ్ టాక్ లాంగ్వేజ్‌పై శ్రద్ధ

తరుచుగా స్వీయ చర్చలో నిమగ్నమైనప్పుడు హార్డ్ హిట్టింగ్ లాంగ్వేజ్, హార్ష్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఎక్స్‌ట్రీమ్‌కు వెళ్లవచ్చు. అందుకే మీ స్వీయ సంభాషణను మార్చడం అవసరం. సులభమైన పదాలను వినియోగించడం మంచిది. ఉదాహరణకు 'నేను ఎప్పటికీ ఏ పని సరిగ్గా చేయలేను' అని చెప్పే బదులు 'కొన్నిసార్లు, నేను విషయాలు సవాలుగా భావిస్తున్నాను. వాటిని పూర్తి చేయడానికి మరింత సమయం కావాలి' అని అనుకోవచ్చు.

2. మిమ్మల్ని మీరు థర్డ్ పర్సన్‌గా ట్రీట్ చేయండి

'నేను' వంటి వ్యక్తిగత సర్వనామాలకు బదులుగా మీ పేరు లేదా మూడో వ్యక్తి మాదిరిగా ట్రీట్ చేస్తూ పదాలను వినియోగిస్తే సెల్ఫ్ టాక్ మరింత ప్రభావవంతంగా ఉంటుందని పరిశోధన సూచించింది. ఇది భావోద్వేగ తీవ్రత నుంచి దూరాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. విశాల దృక్పథాన్ని ఏర్పరుస్తుంది.

3. మైండ్‌ఫుల్‌నెస్ చెక్-ఇన్స్

మీతో మీరు చెక్ ఇన్ చేయడానికి ఒక టైమ్ సెట్ చేసుకోండి. ఆ సమయంలో మీకు ఎలా అనిపిస్తుందో మీరే ప్రశ్నించుకోండి. ఇది మీ మానసిక స్థితి గురించి మరింత అవగాహన కలిగి ఉండటానికి మిమ్మల్ని అనుమతించడంతో పాటు స్వీయ-చర్చపై ప్రభావం చూపుతుంది.

4. టెక్స్ట్ థెరపీ

మీరు టెక్స్ట్- బేస్డ్ థెరపీ ప్రయత్నించవచ్చు. ఇది మీరు ఉపయోగిస్తున్న భాషలోని నమూనాలను నిశితంగా పరిశీలించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. భాష మరియు స్వీయ చర్చల మధ్య బలమైన సంబంధం ఉన్నందున, ఈ విధానాన్ని అర్థం చేసుకోవడానికి థెరపిస్ట్‌తో కమ్యూనికేట్ కావడం ద్వారా మీ స్వీయ సంభాషణను మార్చడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఆత్మవిశ్వాసం పెంపొందించే శక్తి :

మీరు జీవితంలో ఎక్కువగా వినగలిగే స్వరం మీ ఓన్ వాయిస్. ఇది స్వీయ సంభాషణ ప్రభావవంతంగా పని చేయడంలో కీలకంగా మారుతుంది. సెల్ఫ్ టాక్ అనేది భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. మీ గురించి, చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎలా భావిస్తారనే విషయంపై ఆలోచించేలా చేస్తూ.. ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది.

మొత్తానికి పాజిటివ్ సెల్ఫ్ టాక్ శక్తివంతం చేస్తే.. నెగెటివ్ సెల్ఫ్ టాక్ నిలువరిస్తుంది. అందుకే ఉపయోగిస్తున్న భాష, పదాల విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్త వహించండి. ఏదైనా ప్రతికూల చర్చను సానుకూల లేదా తటస్థంగా మార్చడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడంతోపాటు సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకునేందుకు ట్రై చేయండి. ఫైనల్‌గా పాజిటివ్ సెల్ఫ్ కమ్యూనికేషన్ ఆదర్శవంతమైన ప్రారంభానికి దారి తీస్తుందని అంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed