మీ పెదవులు ఇలా ఉంటే మీ లవర్ అస్సలు వదిలిపెట్టడు..

by Dishaweb |   ( Updated:2023-05-31 05:54:37.0  )
మీ పెదవులు ఇలా ఉంటే మీ లవర్ అస్సలు వదిలిపెట్టడు..
X

దిశ, వెబ్‌డెస్క్ : అందమైన ముఖంలో ముందుగా ఆకర్షించేవి పెదాలు. మృదువైన పెదవులు ముఖారవిందాన్ని పెంచడంతోపాటు చక్కటి నువ్వుని ఇస్తాయి. ఇష్ట సఖుడి తొలిముద్దును అందుకునేది కూడా పెదవులే. శృంగార కార్యంలోనూ పెదవులకు ప్రధాన పాత్రే ఉంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పెదవులను సంరక్షించుకోవడం ముఖ్యమే. అయితే వారావరణంలో మార్పులు పెదవులపై తీవ్ర ప్రభావం చూపెడతాయి. అధికంగా వేడి తగిలినా.. చలి వేసినా ముందు దెబ్బ తినేది పెదవులే. అలాగే అనారోగ్యం పాలైన దాని ప్రభావం లిప్స్‌పైనే ఉంటుంది. అయితే ఇంట్లో అందుబాటులో ఉంటే ఐటెమ్స్‌తోనే పెదవుల నిగారింపును పెంచుకోవడంతోపాటు నిత్యం మృదువుగా ఉండేలా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం..

షుగర్ స్క్రబ్:

స్క్రబ్ అనేది పెదాలను అందంగా కనిపించేలా చేస్తుంది. ఆలివ్ ఆయిల్, తేనె, చక్కెరను సమానంగా కలిపి కొన్ని నిమిషాలు పాటు పెదాలను మసాజ్ చేసి అనంతరం చల్లని నీటితో శుభ్రపరచాలి. పెదాలను ఎక్స్ ఫోలియేట్ చేయడానికి, ఈ షుగర్ స్క్రబ్ బాగా పనిచేస్తుంది.

నిమ్మరసం: నిమ్మరసం అనేది నేచురల్ బ్లీచింగ్. ఇది పెదాలను ఎర్రగా కాంతివంతంగా మారుస్తుంది. ఇందుకోసం పెదాలపై కొద్దిగా నిమ్మరసం అప్లై చేసి 15 నిమిషాలు అలానే ఉంచి నీటితో క్లీన్ చేయండి. రెగ్యులర్గా ఇలా చేస్తుంటే మంచి రిజల్ట్ ఉంటుంది.

బీట్ రూట్ జ్యూస్:

ఎర్రని పెదాల కోసం బీట్ రూట్ బాగా పనిచేస్తుంది. బీట్ రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ నల్లని పెదాలను కాంతివంతంగా చేస్తాయి. అందుకోసం రోజు పడుకునే ముందు బీట్ రూట్ రసాన్ని పెదాలకు రాసి రాత్రంతా అలానే ఉంచి ఉదయం కడిగేయడమే.

బాదం ఆయిల్:

బాదం ఆయిల్ డార్క్ లిప్స్ని కాంతివంతంగా, అందంగా మారుస్తుంది. దీనికోసం రోజూ రాత్రి పడుకునే ముందు బాదం ఆయిల్ రాసి రాత్రంతా అలానే ఉంచాలి.

Also Read..

పరగడుపున తినకూడనివి.. స్వీట్ బ్రేక్ ఫాస్ట్ అవాయిడ్ చేయాలని సూచన

బీచ్‌ల్లోనే ఆ ఫీలింగ్ ఎందుకు..? శబ్దాలు, వాసనతోనేనా..?

Advertisement

Next Story