Stains on clothes: దుస్తులపై మరకలు పోవట్లేదా..? ఇలా చేయండి చాలు..!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-12-03 11:41:49.0  )
Stains on clothes: దుస్తులపై మరకలు పోవట్లేదా..? ఇలా చేయండి చాలు..!
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్‌పై మరకలు పడితే వెంటనే దాన్ని వాష్ చేస్తే.. ఆ మరకలు తొలగిపోతాయి. అదే బయటికి వెళ్లినప్పుడు దుస్తులపై మరకలు పడితే వాటిని శుభ్రం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. పైగా ఎక్కువసేపు ఆ మరకలు అలాగే ఉంటే.. అవి మొండి మరకల్లా తయారవుతాయి. ఇలా ఎలాంటి సందర్భాల్లో అయినా సరే దుస్తులపై మరకలు తొలగిపోవాలంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే, మొండి మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు.

* దుస్తులపై నూనె మరకలు అంత ఈజీగా తొలగిపోవు. వీటిని వదిలించుకోవాలంటే బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాను మరకలపై చల్లి, అరగంట తర్వాత బ్రష్‌తో రుద్దాలి. ఆ తర్వాత వెనిగర్‌లో కొంచెం నీళ్లు కలిపి, మరకలపై స్ప్రే చేయాలి. 10 నిమిషాల తరువాత ఉతికితే మరకలు తొలగిపోతాయి.

* ఒక వేళ దుస్తులపై టీ మరకలు పడితే, వాటిని తొలగించడానికి వెనిగర్ సరిపోతుంది. ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ర్పే బాటిల్‌లో పోసి మరక పడిన చోట స్ప్రే చేయాలి. ఆ తరువాత నెమ్మదిగా సబ్బుతో రుద్దితే మరకలు ఈజీగా పోతాయి.

* పట్టు చీరలు లేదా కొత్త దుస్తులు ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసం కలిపడం వల్ల దుస్తుల రంగు పోకుండా ఉంటుంది.

* చాక్లెట్ మరకలు వదలాలంటే కొద్దిగా బట్టల సోడా కలిపిన నీళ్లలో 20 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత సబ్బుతో ఉతికేయాలి.

* కొన్ని సందర్భాల్లో బట్టలపై రక్తం మరకలు లేదా తుప్పు మరకలు పడితే, ఈ మరకలను తొలగించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను వాడాలి. మరకలు పడిన చోట హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను కొద్దిగ వేయాలి. కొంత సమయం తరువాత సబ్బుతో ఉతికితే ఈ మరకలు తొలగిపోతాయి.

* బట్టలపై ఇంకు పడితే ఈ మరకలను హ్యాండ్ శానిటైజర్ తొలగిస్తుంది. మరక పడిన ప్లేస్‌లో కొంచెం శానిటైజర్ చల్లి కొంచెం సేపు అలా వదిలేయాలి. తరువాత డిటర్జెంట్‌తో ఉతికితే ఇంకు మరకలు తొలగిపోతాయి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.

Advertisement

Next Story

Most Viewed