వర్షాకాలంలో వీటిని తీసుకుంటే రోజంతా ఎనర్జీగా ఉంటారు

by Prasanna |   ( Updated:2023-08-07 07:27:33.0  )
వర్షాకాలంలో వీటిని తీసుకుంటే రోజంతా ఎనర్జీగా ఉంటారు
X

దిశ, వెబ్ డెస్క్: వానా కాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా జలుబు, దగ్గు, సైనస్ వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి సాధ్యమైనంతవరకు గోరు వెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలి. మన రోజువారీ ఆహారంలో మసాలా దినుసులను చేర్చుకోవాలి. వీటిని తీసుకుంటే మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.. అవేంటో ఇక్కడ చూద్దాం..

పసుపు : మన అందరి ఇళ్లల్లో పసుపు ఉంటుంది. ఎందుకంటే వీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు దీనిలో అధికంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట పసుపు పాలను తీసుకోవాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

లవంగం: వర్షాకాలంలో లవంగాలు తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. దీనిలో కాల్షియం, ఐరన్‌, మెగ్నిషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి మినరల్స్‌ ఉంటాయి. అలాగే ప్రతిరోజు పరగడుపునే 3 లవంగాలను నమిలి తినడం వల్ల శృంగార జీవితం మెరుగు పడుతుంది.

దాల్చిన చెక్క : దాల్చిన చెక్కలో అద్భుత ఔషధ గుణాలున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహ వ్యాధి ఉన్న వారికి రక్తంలో ఇది చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది.ఆకలి తక్కువగా ఉన్న వారు ప్రతిరోజు గ్లాసు పాలలో దాల్చిన చెక్క పొడి కలుపుకొని తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.

Read More : మీరు యాక్టివ్‌గా పనిచేయాలా?.. అయితే ఈ హెల్తీ డైట్ ఫాలో అవండి

Advertisement

Next Story

Most Viewed