వీటిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడమే కాదు, షుగర్, బీపీలొస్తాయి.. జాగ్రత్త

by Prasanna |
వీటిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడమే కాదు, షుగర్, బీపీలొస్తాయి.. జాగ్రత్త
X

దిశ, ఫీచర్స్: మనం ఆరోగ్యంగా ఉండాలంటే హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. మనం ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటున్నమా? అనేది తెలుసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్స్‌‌పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పోషకాలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ ఆహారాలను తీసుకోవాలనుకుంటే..

జంక్ ఫుడ్ తింటే..

ఇంట్లో ఫుడ్ తీసుకోకుండా చాలా మంది బయట ఫుడ్స్ కు అలవాటు పడ్డారు. వేడివేడిగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్స్, నూనెలో వేయించిన ఆహారాలు ఫుడ్స్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇవి మన శరీరంలో నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి, అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిలో ఉండే ట్రాన్స్‌ఫ్యాట్స్ కారణంగా కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

స్వీట్స్..

కొందరు చలికాలంలో స్వీట్స్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. ముఖ్యంగా పాలతో తయారైన కేక్స్, పిండి వంటలు, స్వీట్స్ తింటుంటారు. దీని వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. దీని వల్ల బీపి, షుగర్, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పిజ్జా

ఖాళీ సమయం దొరికితే చాలు.. పిజ్జా ఆర్డర్ చేసుకుని తినేస్తుంటారు. కానీ, ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకుంటే, ఇది ప్రాసెస్డ్ పిండితో చేయడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా దీనిలో ఉండే శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల చిన్న వయసులోనే హైబీపి, గుండె సమస్యలు వస్తాయి.

Advertisement

Next Story