- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తలనొప్పి వస్తే వాంతులు అవుతున్నాయా.. కారణం అదే..!
దిశ, ఫీచర్స్ : చాలామంది తల నొప్పి వచ్చిందంటే చాలు వాంతులు చేసుకుంటూ ఉంటారు. కడుపులో గ్యాస్ ఎక్కువ కావడంతో కొంతమందికి తలనొప్పి, వాంతులు వస్తూ ఉంటాయి. మలబద్ధకం గ్యాస్ కి, తలనొప్పికి కారణమవుతుంది. సమయానికి సరైన ఆహారం లేకపోయినా అపానవాయువు, అజీర్ణం సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రసాయనాలు ఎర్రబడిన గట్ నుండి బయటికి వెళ్లి రక్తప్రవాహంలో ప్రవహించి అవి మెదడు పై ప్రభావం చూపిస్తాయి. దీంతో తలనొప్పి, వికారం, వాంతులు వస్తుంటాయి. అలాగే ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని ఇంట్లోనే చిన్నచిట్కాలతో పోగొట్టుకోవచ్చంట. మరి ఆ తలనొప్పి, వాంతులు తగ్గించే హోమ్ రెమిడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మజ్జిగ తాగడం వలన అజీర్ణం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్, లాక్టిక్ యాసిడ్ పుల్లని త్రేనుపు, మలబద్ధకం సమస్యల నుంచి బయటపడేస్తుంది. అలాగే నిమ్మరసం కలిపిన నీళ్లను ఉదయం నిద్రలేవగానే తాగితే జీర్ణ సమస్యలు నయమవుతాయి. కడుపులోని యాసిడ్ ను తగ్గించి తలనొప్పి తగ్గేందుకు నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే తులసి ఆకులను నోటితో నమిలితే కడుపులో మంటను తగ్గిస్తుంది. అంతేకాదు గ్యాస్ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.