కోరికలు పెంచే పండ్లు.. ఇవి తింటే శృంగారంలో మీకు తోపే ఉండరు

by Jakkula Mamatha |
కోరికలు పెంచే పండ్లు.. ఇవి తింటే శృంగారంలో మీకు తోపే ఉండరు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం చాలా మందిలో లైంగిక కోరికలనేవి తగ్గిపోతున్నాయి. మనం తీసుకుంటున్న ఆహార పదార్థాలు, జీవన శైలి, వర్క్ ప్రెషర్ లాంటి అనేక కారణాల వలన లైంగిక కోరికలు అనేవి రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. దీంతో వైవాహిక జీవితంలో కలతలు, సమస్యలు ఎదురు అవుతున్నాయి.అయితే లైంగిక కోరికలు పెంచడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి అంటున్నారు నిపుణులు. కాగా, రోజూ పండ్లను తీసుకోవడం వలన లైంగిక సామర్థ్యం పెరుగుతుందంట. అందువలన ఏ పండ్లు తీసుకోవడం వలన లైంగిక జీవితం బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పుచ్చకాయలో ఎల్ సి ట్రైన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీన్ని తీసుకోవడం అంగస్తంభన పనితీరు మెరుగ్గా ఉంటుందంట. అలాగే ఆపిల్,కూడా లైంగిక సామర్థ్యం పెంచడంలో తోడ్పడుతుంది అంటున్నారు వైద్యులు.ముఖ్యంగా అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. అందువలన రోజూ ఉదయం ఒక అరటి పండు తీసుకోవడం వలన జననేంద్రియాలతో సహా అన్ని శరీరంలో కొన్ని భాగాలకు రక్తప్రసరణ మెరుగుపడి, లైంగిక సామర్థ్యం పెరుగుతుందంట. అదే విధంగా ధానిమ్మ, ఆవకాడో,స్ట్రాబెర్రీస్ వంటి ఫ్రూట్స్ ప్రతి రోజూ తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుండడమే కాకుండా లైంగిక సామర్థ్యం బాగుంటుదని చెబుతున్నారు నిపుణులు.

Advertisement

Next Story