- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఆహారాన్ని తింటే సెంచరీ కొట్టడం ఖాయం !
దిశ, ఫీచర్స్ : ఒకప్పటి కాలంలో చాలామంది వంద ఏండ్లు బతికేవారు. కానీ కాలానుగుణంగా ఆయువు ప్రమాణం తగ్గి 50 ఏండ్లు లేదా 60 ఏండ్లు మాత్రమే బతుకుతున్నారు. మరి కొంతమంది ఇప్పుడు జంక్ ఫుడ్ తిని అర్థాంతరంగానే తనువు చాలిస్తున్నారు. మనిషి ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతకాలన్నా, అనారోగ్యంతో అర్థాంతరంగా చనిపోవాలన్నా దానికి కారణం మనం తీసుకునే ఆహారం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కాలం మనుషులు బ్రతికే దేశాల జాబితాలో సార్డినియా, ఇటలీ, ఒకినావా, జపాన్, గ్రీస్, నికోయా, కోస్టా ఉన్నాయి. ఆయా దేశాల ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటారో, ఎలాంటి ఆహారాన్ని తినకూడదో, ఏ డైట్ ఫాలో అవుతారో ఇప్పుడు చూద్దాం..
మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎక్కువ కాలం జీవించాలన్నా ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఇంట్లో తయారు చేసుకున్న నాచురల్ ఫుడ్ ని తింటే మనిషి ఆరోగ్యంగా ఉంటారు. ఫైబర్ పుష్కలంగా ఉండే బీన్స్ ను ప్రతిరోజు ఒక కప్పు తినాలి. అలాగే కాయధాన్యాలు, పింటో బీన్స్, బ్లాక్ బీన్స్, గార్బన్జో బీన్స్ తీసుకుంటే కాలేయాన్ని కాపాడుకోవచ్చు. ఇది గుండె పనితీరును కూడా మెరుగు పరుస్తుంది. క్యాన్సర్ కణాలను కంట్రోల్ చేసి దాని బారిన పడకుండా చేస్తాయి. ప్రతిరోజు నట్స్ తినడం వలన ఎంతో మేలు కలుగుతుంది. నట్స్ లో ఉండే మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు పండ్లు కూరగాయలు తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ఫోలేట్ లను అందిస్తాయి. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తింటే పెద్దప్రేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది.