శృంగారం తరువాత ఈ పనులు చేస్తే మరింత ఆనందం మీ సొంతం

by Sridhar Babu |   ( Updated:2023-06-21 10:04:34.0  )
శృంగారం తరువాత ఈ పనులు చేస్తే మరింత ఆనందం మీ సొంతం
X

దిశ, వెబ్​డెస్క్​ : శృంగారంలో ఆనందం కోసం దంపతులు ఎన్నో విధానాలు పాటిస్తారు. అందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగిస్తారు. కానీ అందరికీ తెలవని విషయం ఏమిటంటే శృంగారం చేసిన తరువాత కొన్ని రకాల పనులు ఖచ్చితంగా చేయాలట. అప్పడు ఆ దంపతులు ఎంతో ఆనందంగా ఉంటారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీరి పరిశోధనల ప్రకారం శృంగారానికి ముందు కంటే తరువాత కలిసి స్నానం చేయడం మంచిదట. దాంతో ఒకరిపై మరొకరికి మరింత ప్రేమ కలుగుతుంది. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. శృంగారం తరువాత అందరూ చేసే పని వెంటనే నిద్రలోకి జారుకోవడం.

ఇది మరింత నష్టాన్ని కలిగిస్తుంది. అలా కాకుండా కొద్ది సేపు మనసు విప్పి మాట్లాడుకోవడం, సంగీతం వినడం మంచిది. దాంతో మనసు ఉల్లాసంగా మారుతుంది. అలాగే ఒకరినొకరు మెచ్చుకోవడం కూడా ఇద్దరి మధ్య ప్రేమను పెంచుతుందని చెబుతున్నారు. మీరు చెప్పే మాటలు మీ భాగస్వామికి మీ మీద ప్రేమను మరింత పెంచుతుంది. అలాగే ఒకరికొకరు సేవలు చేసుకోవడం కూడా మరిచిపోకండి. సున్నితంగా మాసజ్ చేయండి. ఇద్దరిలో ఎవరికి శృంగార విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని వదిలేయండి. ఇష్టం లేని విషయాలను బలవంతంగా చేస్తే మీ మీద ఉన్న కాస్తంత ప్రేమ కూడా పోతుంది. కావున పై విషయాలు పాటిస్తే మళ్లీ శృంగారానికి దారులు సుముఖంగా మారుతాయి. ప్రతి సారీ మరింత ఆనందం మీ సొంతం అవుతుంది.

Also Read.

ఇంట్లో మనిషి చనిపోతే మహిళ ఆ పార్ట్ కట్.. శవాన్ని పూర్తిగా కాల్చకుండా ఇంట్లోనే పందితో..

భర్త శృంగారానికి నిరాకరించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story