స్మార్ట్ ఫోన్ అతిగా వాడితే తల్లో‌కి పేలు వస్తాయా.. వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్!

by Jakkula Samataha |
స్మార్ట్ ఫోన్ అతిగా వాడితే తల్లో‌కి పేలు వస్తాయా.. వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్!
X

దిశ, ఫీచర్స్ : కొందరికి తలలో పేలు ఉంటాయి. అవి తలలోనే అటు ఇటు తిరుగుతూ రక్తాన్ని తాగి బతుకుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా పేలు ఉంటాయి. వారితో ఎవరైనా చనువుగా ఉంటే, తలలు పరస్పరం తాకినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయి. అంతే కాకుండా ఎక్కువ మంది ఒకే చోట కలిసి ఉండటం, పొడవాటి జుట్టు, ఎక్కువగా తలస్నానం చేయని వారిలో ఈ పేల సమస్య ఎక్కువగా ఉంటుందంట. అయితే తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? స్మార్ట్ ఫోన్ల ద్వారా పేలు వ్యాపించడం. అవును మీరు వింటున్నది నిజమే? చాలా మంది ఆశ్చర్యపోతుంటారు, స్మార్ట్ ఫోన్స్‌కు, పేల వ్యాప్తికి సంబంధం ఏంటి అని, కానీ దీనికి సంబంధం ఉంది అంటున్నారు చర్మ నిపుణురాలు టెస్ మెక్ ఫర్సన్.

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవరూ ఉండటం లేదు. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్‌కు చాలా అడెక్ట్ అయ్యింది. సెల్పీలు, సరదాగా వీడియోలు, ఫోటోస్, లుడో లాంటి గేమ్స్ ఆడటం కోసం తలలన్నీ దగ్గరగా పెట్టుకుంటారు. అయితే అలా ఒకరి జుట్టు ఒకరికి తాకడం వలన పేలు వ్యాపిస్తున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed