ఆ కల వస్తే నిజంగానే ఆరు నెలల్లో చనిపోతారా?

by Jakkula Samataha |
ఆ కల వస్తే నిజంగానే ఆరు నెలల్లో చనిపోతారా?
X

దిశ, ఫీచర్స్ : కలలు రావడం అనేది సహజం. చాలా మంది కలలు కంటుంటారు.ఇక స్వప్నశాస్త్రంలో కలల గురించి చాలా బాగా విశ్లేషించారు. ఎలాంటి కల వస్తే మంచిది? ఎలాంటి కలలు వస్తే చెడు జరిగే అవకాశం ఉంది అని తెలియజేశారు. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కల వస్తే ఆ మనిషి ఆరు నెలలో చనిపోతున్నట్లే అంటున్నారు కొందరు. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు, ఏదైనా గ్రామాన్ని ఖాళీ చేయడం కానీ, ధ్వంసం చేస్తున్నట్లు కల వస్తే మృత్యువు సమీపిస్తున్నట్లేనంట. అలాగే కాకి లేదా గద్ద తలపై కూర్చున్నట్లు కల వచ్చినా అది మరణానికి సంకేతమేనంట.

అలాగే శివపూరాణం ప్రకారం.. పార్వతీ దేవి ఒకసారి తన భర్త శివుడిని ఇలా అడుగుతుంది.స్వామి మరణానికి సంకేతం ఏమిటి? మరణం రాబోతుందని ఎలా తెలుసుకోవచ్చు అని ప్రశ్నించగా? పరమశివుడు మాట్లాడుతూ..ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు కొద్దిగా ఎరుపు రంగులోకి మారినప్పుడు ఆ మనిషి మరో ఆరునెలలో చనిపోతున్నట్లు అర్థం. అలాగే ఒక పిట్ట నీళ్లలో మునిగి తేలుతున్నట్లు కనిపించిన వారు త్వరలో చనిపోతున్నారు అనే అర్థం అని తెలియజేశాడంట. ఇక వీటిని కొంత మంది నమ్మితే మరికొంత మంది మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తారు. నోట్ : ఇది ఇంటర్నెట్‌లో ఇచ్చిన సమాచారం మేరకే ఇవ్వబడినది, దిశ దీన్ని ధృవీకరించలేదు.

Advertisement

Next Story

Most Viewed