Oropouche : మానవాళి పై వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల దాడి.. ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్‌..

by Sumithra |   ( Updated:2024-08-31 11:56:54.0  )
Oropouche : మానవాళి పై వైరస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల దాడి.. ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్‌..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : గత కొన్నేళ్ల నుంచి ఏదో ఒక వైరస్ ఏదో ఒక దేశాన్ని భయపెడుతూనే ఉంది. 2019-2020లో ఒక్కసారిగా విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికించింది. ఎంతో మంది ప్రాణాలను పొట్టలో పెట్టుకుంది. ఇప్పటికీ దీని పేరు వింటేనే కాళ్ల కింద భూమి కంపించినట్టవుతుంది. అయితే గత కొద్ది రోజులుగా మంకీపాక్స్ కూడా ఇంచుమించు కరోనా లాగే అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ క్రమంలోనే మరో వైరస్ కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చేసింది. దీంతో మళ్లీ ఎలాంటి విధ్వంసం జరుగుతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇంతకీ ఆ వైరస్ లు ఏంటి అంటే ఓరోపౌచ్, మంకీపాక్స్.

ప్రపంచవ్యాప్తంగా మంకిపాక్స్ వైరస్ ఎంత మందికి సోకి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అమెరికా చుట్టూ ఓరోపౌచ్ అనే కొత్త వైరస్ ను మొదటిసారిగా గుర్తించారు. ఇప్పటికే ఎంతో మందిని ఆసుపత్రుల పాలు చేసిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా విస్తరిస్తోంది. దక్షిణ అమెరికాలో విస్తరించిన తర్వాత, పెరూ, బ్రెజిల్ దేశాల్లో కూడా ఓరోపౌచ్ కేసులు నమోదవుతున్నాయని వైద్యశాఖ నివేదికల్లో చెబుతున్నారు. మొదట కాస్త జ్వరం వచ్చి తర్వాత దాని ప్రతాపం చూపిస్తుందంటున్నారు నిపుణులు. ఇప్పటికే దీని బారిన పడినవారిలో బ్రెజిల్‌లోని ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారని నివేదికలు చెబుతున్నాయి. అందుకే ఈ రెండు వైరస్ లు పాతవే అయినా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ఎలా వ్యాపిస్తుంది..

ఒరోపౌచ్ వైరస్ క్యులికోయిడ్స్ పరేన్సిస్ జాతికి చెందిన మిడ్జెస్ కాటు ద్వారా ప్రజలకు వ్యాపిస్తుంది. ఒరోపౌచీని నిరోధించడానికి టీకాలు, మందులు కూడా లేవంటున్నారు నిపుణులు. ఒరోపౌచ్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం మిడ్జెస్, దోమల కాటు బారిన పడకుండా ఉండడమే అంటున్నారు.

1955వ సంవత్సరంలో ట్రినిడాడ్ లోని టొబాగోలోని ఉండే ఒక ప్రాంతంలో ఈ వైరస్ ని కనుగొన్నారట. 2000 సంవత్సరానికి ముందు, బ్రెజిల్, పనామా, పెరూలో ఒరోపౌచ్ వైరస్ వ్యాప్తి చెందింది. ఈ సమయంలో కొలంబియా, ట్రినిడాడ్‌లలో సోకినట్లు తెలిపారు. గత 25 సంవత్సరాలలో బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్, ఫ్రెంచ్ గయానా, పనామా, పెరూతో సహా అమెజాన్ ప్రాంతంలోని అనేక దేశాలలో ఒరోపౌచ్ కేసులు గుర్తించారు. 2014లో కూడా హైతీలో ఒక చిన్నారికి వ్యాధి సోకింది. ఇక జూన్ 2024లో క్యూబా మొదటి ఒరోపౌచ్ కేసును గుర్తించినట్టు నివేదికల్లో తెలిపారు.

లక్షణాలు..

అకస్మాత్తుగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, చలి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు సాధారణ లక్షణాలు. ఇతర లక్షణాలు మైకము, కళ్ల వెనుక నొప్పి, వికారం, వాంతులు, దద్దుర్లు ఉంటాయి. లక్షణాలు సాధారణంగా ఒక వారం (2–7 రోజులు) కంటే తక్కువగా ఉంటాయి. కొన్ని రోజులు లేదా వారాల తర్వాత కూడా ఈ లక్షణాలు పునరావృతమవుతాయి. మరికొంతమందికి మెనింజైటిస్, ఎన్సెఫాలిటిస్ లేదా రక్తస్రావం లాంటి లక్షణాలు కూడా కలుగుతాయి.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story