Smita Sabharwal: IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంటర్ మార్క్స్ షీట్ వైరల్.. ఎన్ని మార్కులు వచ్చాయో చూడండి...

by Sujitha Rachapalli |
Smita Sabharwal:  IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంటర్ మార్క్స్ షీట్ వైరల్.. ఎన్ని మార్కులు వచ్చాయో చూడండి...
X

దిశ, ఫీచర్స్: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ అతి చిన్న వయసులో యూపీఎస్సీ క్లియర్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె.. ఈ మధ్య సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో డిసెబుల్ పర్సన్స్ కోటా ఎందుకన్న కామెంట్స్ తో విమర్శలు ఎదుర్కొంది. ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ 12వ తరగతి మార్క్స్ షీట్ వైరల్ అవుతుంది.

యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయినా.. సెకండ్ అటెంప్ట్ లో ఆల్ ఇండియా ఫోర్త్ ర్యాంక్ సాధించింది స్మితా సబర్వాల్. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ కు చెందిన బెంగాల్ ఫ్యామిలీకి చెందిన ఆమె.. ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రం హైదారాబాద్ సెయింట్ ఆన్స్ హై స్కూల్ లో జరిగింది. 12వ తరగతిలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో నేషన్ వైడ్ అటెన్షన్ క్యాచ్ చేసింది. CISCE - 1995 లో హిందీ, ఇంగ్లీష్ లో 100కు 94 మార్కులు సాధించిన ఆమె.. ఎకనామిక్స్ లో 100కు 90 సాధించింది.

Advertisement

Next Story

Most Viewed