మీ పార్టనర్ గురకతో రాత్రంతా విసిగిపోతే.. సింపుల్‌గా ఈ పని చేయండి..

by Sujitha Rachapalli |
మీ పార్టనర్ గురకతో రాత్రంతా విసిగిపోతే.. సింపుల్‌గా ఈ పని చేయండి..
X

దిశ, ఫీచర్స్: గురకను చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ బీపీ, డయాబెటిస్, హార్డ్ డిసీజెస్, స్ట్రోక్ వంటి తీవ్ర అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. అందుకే మీరు లేదా మీ పార్టనర్, మీకు తెలిసిన ఎవరైనా నిద్రలో గురక పెడుతుంటే సీరియస్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇందుకు గల కారణాలను అర్థం చేసుకుని.. లైఫ్ స్టైల్, ఫుడ్‌ హ్యాబిట్స్‌లో చేంజ్ చేస్తే తగ్గిపోతుందని చెప్తున్నారు. ఇంతకీ ఇది ఎందుకు వస్తుంది? నివారించే పద్ధతులు ఏంటి? తెలుసుకుందాం.

నిద్రలో ముక్కు, గొంతులో గాలి ప్రవాహానికి ఆటంకం కలిగితే గురక వస్తుంది. బ్లాక్ అయిపోయిన ముక్కు, రిలాక్స్ అయిన గొంతు కండరాలు, అదనపు గొంతు కణజాలం గురకకు కారణం అవుతుండగా.. ఎక్కువ నాసికా, గొంతు కణజాలం ఉన్న వ్యక్తులు గురక పెడుతుంటారు. ఊబకాయం , అధిక మద్యపానం, ధూమపానం, అలెర్జీలు, సైనస్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.


ఆరోగ్య ప్రమాదాలు

నిద్రలో గురక పెట్టడం వల్ల ఇతరులను ఇబ్బంది పెడుతుంటారు. వారి స్లీప్ డిస్టర్బెన్స్‌కు కారణం అవుతారు. కానీ అంతకు మించిన అనారోగ్య ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. గురక కారణంగా తగినంత నిద్ర లేకపోవడం అలసటకు దారితీస్తుంది. స్లీప్ అప్నియా, నిద్రలేమి వంటి స్లీప్ డిజార్డర్స్‌తో బాధపడే పరిస్థితి తలెత్తుతుంది. థైరాయిడ్ పనితీరును ప్రభావితం చేయడంతో సంతానోత్పత్తి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.


ఈ ఆహారాన్ని తీసుకోండి..

తేనె: యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిగిన తేనె.. ముక్కు భాగాలకు ఉపశమనం కలిగిస్తుంది. నాజిల్ బ్లాక్ కాకుండా చేస్తుంది. దీంతో నిద్రలో సులభంగా శ్వాస తీసుకోవచ్చు.

పసుపు పాలు: నేచురల్ యాంటీ బయాటిక్‌గా పనిచేసే పసుపు ముక్కు, గొంతు వాపును నివారిస్తుంది. కాబట్టి గోరువెచ్చని పాలలో ఒక టీస్పూన్ పసుపు యాడ్ చేసి పడుకునే ముందు తాగితే గురక రాకుండా ఉంటుంది.

చేపలు: ప్రొటీన్,ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉన్న చేపలు ముక్కు మార్గాలను అడ్డుకునే కఫం ఉత్పత్తిని తగ్గించగలవు.

ఉల్లిపాయలు: యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఉల్లిపాయలు ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. నాజిల్ బ్లాక్‌ కాకుండా ఉంచుతాయి.

సోయా మిల్క్: లాక్టోస్ సెన్సిటివిటీ ఉన్న వ్యక్తులకు సోయా పాలు డైరీ మిల్క్‌కు మంచి ప్రత్యామ్నాయం. కాగా ఇది శ్లేష్మం ఉత్పత్తిని తగ్గించి ముక్కు నార్మల్‌గా ఉండేలా చేస్తుంది.

పైనాపిల్: నేచురల్ డీకాంగెస్టెంట్‌గా పనిచేసే ఈ పండు.. ముక్కు,గొంతులో మంటను తగ్గిస్తుంది. ఇది త్వరగా జీర్ణం అవుతుంది కాబట్టి పడుకునే ముందు తినడం వల్ల గురకను నిరోధించవచ్చు.

టీ: చమోమిలే టీ, గ్రీన్ టీ, పుదీనా టీ, బ్లాక్ టీ శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, బ్లాక్ అయిన నోస్ ఓపెన్ కావడానికి సహాయపడతాయి. అయితే కెఫీన్ కంటెంట్ కారణంగా నిద్రపోయే టైంలో స్ట్రాంగ్ టీని తాగడం మానుకోండి.లేదంటే నిద్రకు ఆటంకం కలుగుతుంది.

లైఫ్ స్టైల్ చేంజెస్

అవాయిడ్ హెవీ మీల్: నిద్ర పోయే ముందు భోజనం ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మానుకోండి. ఇది నిద్రలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి దారితీస్తుంది.

ఆల్కహాల్: మద్యపానం వల్ల గొంతు కండరాలు రిలాక్స్ అయి గురక వచ్చేస్తుంది. ముఖ్యంగా నిద్రకు ముందు మందుకు దూరంగా ఉండటం మంచిది.

హెల్తీ వెయిట్: ఊబకాయం గురకను మరింత తీవ్రతరం చేస్తుంది. కాబట్టి మితమైన ఆహారం, వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం మంచిది.

హైడ్రేషన్: పుష్కలంగా నీరు త్రాగడం నాసికా భాగాలను క్లియర్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

గుడ్ స్లీప్: రెగ్యులర్ స్లీప్ రొటీన్ సెట్ చేసుకోండి. బోర్లాపోయి నిద్రించే బదులు పక్కకు తిరిగి పడుకోండి. పడుకునే చోటు ప్రశాంతమైన నిద్రకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి.

Advertisement

Next Story

Most Viewed