Pizza Dosa: నోరూరించే పిజ్జా దోశ తయారీ విధానం.. పిల్లల ఆరోగ్యం కోసం ఇంట్లోనే ఇలా తయారు చేయండి!

by Anjali |   ( Updated:2024-09-22 14:58:39.0  )
Pizza Dosa: నోరూరించే పిజ్జా దోశ తయారీ విధానం.. పిల్లల ఆరోగ్యం కోసం ఇంట్లోనే ఇలా తయారు చేయండి!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో పిజ్జా, బర్గర్లు తినేవారి సంఖ్య పెరిగింది. అందులో పిల్లలు ఇవంటే విపరీతంగా తినడానికి మొగ్గుచూపుతున్నారు. కానీ పిజ్జాలు తీసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. ఎందుకంటే ఇవి జంక్ ఫుడ్ కిందకే వస్తాయి. కాగా హ్యాపీగా ఇంట్లోనే పిజ్జా దోశను వేసి మీ పిల్లలకు పెట్టండి. ఇంట్లో చేసిన ఈ ఆరోగ్యకరమైన పిజ్జా తింటే పిల్లల హెల్త్‌ను కాపాడిన వారవుతారు.

పిజ్జా దోశకు కావలసిన పదార్థాలు..

దోశల పిండి – వన్ కప్పు, టమాటా తరుగు, క్యాప్సికం, మిరియాల పొడి – పావు స్పూను, చిల్లీ ప్లేగ్స్, బటర్, తురిమిన చీజ్, ఒరెగానో – అర స్పూను, పిజా సాస్, ఉప్పు, ఉల్లిపాయల ముక్కలు, ఒరెగానో , స్వీట్ కార్న్ గింజలు తీసుకోవాలి.

తయారీ విధానం..

గ్యాస్ పై కడాయి పెట్టుకుని దోశ పిండిని ఊతప్పంలా మందంలా వేసుకొని మూత పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక.. దానిపై బటర్, పిజ్జా సాస్ వేయాలి. వీటిపై తరిగిన క్యాప్సికం, టమామా, ఉల్లిపాయల్ని వేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ గింజల్ని, మిరియాల పొడిని, చిల్లీ ఫ్లాగ్స్, ఒరెగానో చల్లాలి. 2 మినిట్స్ అయ్యాక చీజ్ ను వేసి మళ్లీ బటర్ వేయాలి. 5 నిమిషాలు తర్వాత పిజ్జా దోశ రెడీ అయిపోయినట్లే.. ఇక మీ పిల్లలకు పిజ్జా కట్టర్‌తో కట్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Read More...

Mutton Bone Soup: సండే సాయంత్రం వేళ మటన్ బోన్ సూప్ ఇలా ప్రిపేర్ చేయండి.. కాల్షియం లోపానికి చెక్ పెట్టండి!

Advertisement

Next Story

Most Viewed