రెస్టారెంట్ స్టైల్‌లో పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే చికెన్ కబాబ్స్ రెసిపీ తయారీ విధానం!!

by Anjali |
రెస్టారెంట్ స్టైల్‌లో పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే చికెన్ కబాబ్స్ రెసిపీ తయారీ విధానం!!
X

దిశ, వెబ్‌డెస్క్: చికెన్ లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కాగా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు చికెన్ తో పలు రకాల రెసిపీలు తయారు చేస్తుంటారు. కానీ కొన్ని రకాల వంటకాలు రెస్టారెంట్లో వండితేనే టేస్ట్ అదిరిపోతుందని భావిస్తారు. కానీ అలాంటి ఏం డౌట్స్ లేకుండా చికెన్ కబాబ్స్‌ను రెస్టారెంట్ స్టైల్‌లోనే చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు. కాగా చికెన్ కబాబ్స్ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం..

చికెన్ కబాబ్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు..

అరకిలో చికెన్ కీమా, పచ్చిమర్చి-4, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా , కొత్తిమీర తరుగు -2 స్పూన్లు, అర స్పూను గరం మసాలా, చాట్ మసాలా, కారం, జీలకర్ర పొడి - ఒక స్పూను, రచికి సరిపడ సాల్ట్, అరస్పూన్ మిరియాల పొడి, రెండు స్పూన్ల బటర్ తీసుకోవాలి.

చికెన్ కబాబ్‌ తయారీ విధానం..

చికన్ కబాబ్స్ ముందుగా నీటిలో ఒక 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఎందుకంటే కాల్చేటప్పుడు మాడకుండా ఉంటాయి. తర్వాత చికెన్ కీమాను క్లీన్ గా కడుక్కుని అల్లం, వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ తరిగిన పచ్చిమిర్చి, పుదీనా కొత్తిమీర, చాట్ మసాలా, జీలకర్ర, గరం మసాలా, మిరియాల పొడి చివరగా కోడిగుడ్డు సొన వేసి కలుపుకోవాలి. కోడిగుడ్డు సొనకు బదులు శెనగపిండిని కూడా యాడ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. అనంతరం చిన్న ముద్దలుగా చేసుకుని కబాబ్ స్టిక్స్ కు అతికించి పొడవుగా వచ్చేలా చేయండి. తర్వాత పెనంపై బటర్ వేసి స్టిక్స్ కు కబాబ్స్ అలికించి పెనం మీద వేసి రెండు వైపులా కాల్చండి. ఇక టమాటా సాస్ లేదా గ్రీన్ చట్నీతో ఇవి తింటే రుచి అదిరిపోతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed