మానసిక ఒత్తిడితో డయాబెటిస్, గుండె జబ్బులు.. ఎలా బయటపడాలంటే..

by Javid Pasha |
మానసిక ఒత్తిడితో డయాబెటిస్, గుండె జబ్బులు.. ఎలా బయటపడాలంటే..
X

దిశ, ఫీచర్స్ : మానసిక ఒత్తిడి.. ఇది కేవలం పెద్దలు మాత్రమే ఎదుర్కొనే సమస్య అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు యువతరాన్ని కూడా పట్టి పీడిస్తోంది. సకాలంలో గుర్తించి తగిన కేర్ తీసుకోకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కారణం అవుతోంది. అయితే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎలా బయటపడాలో చూద్దాం.

రోజువారీ జీవితంలో సంతోషం కంటే బాధలను, ఇబ్బందులను ఎక్కువగా ఊహించుకునే పరిస్థితులే మెంటల్ స్ట్రెస్‌కు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. అలాగే సామాజిక పరిస్థితుల్లో కలువకపోవడం, మనుగడకు అవసరమైన అంశాలపై ఆసక్తిలేకపోవడం, అధిక ఒత్తిడి, కుటుంబ, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. క్రమంగా డిప్రెషన్‌కు దారితీస్తాయి.

మరి కొందరిలో ఆందోళన, భయం, న్యూరో ట్రాన్స్‌మిటర్లలోని కెమికల్ యాక్టివిటీస్‌లో మార్పులు, మెదడుకు గాయాలు వంటివి మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. జీవితంలో భయానక పరిస్థితులు, బాధాకరమైన సంఘటనలు, తీవ్రమైన సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం, ప్రియమైన వ్యక్తి చనిపోవడం లేదా విడిపోవడం మత్తు పదార్థాలకు అలవాటు పడటం వంటివి యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. క్రమంగా నిద్రలేమి, ఊబకాయం, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి వ్యాధులకు కారణం అవుతాయి.

నివారణ ఎలా?

మెంటల్ స్ట్రెస్‌కు గురిచేసే పరిస్థితులను నివారించడమే చక్కటి పరిష్కారం. అందుకోసం రోజు వారి వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి దోహదం చేస్తాయి. ఇబ్బంది కర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, కొలీగ్స్ లేదా మానసిక నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఫైనల్లీ ఏ పరిస్థితులైతే మిమ్మల్ని ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురిచేస్తుంటాయో వాటినుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.

Advertisement

Next Story

Most Viewed