Parivrtta Namaskara Trikonasana Yoga: పరివృత నమస్కార త్రికోణాసనం ఎలా చేయాలి.. దాని ఉపయోగాలు

by samatah |   ( Updated:2022-06-22 06:03:42.0  )
How To Do Parivrtta Namaskara Trikonasana Yoga
X

దిశ, ఫీచర్స్ : How To Do Parivrtta Namaskara Trikonasana Yoga| పరివృత నమస్కార త్రికోణ కౌంటర్ ఆసనంగా పిలిచే భంగిమను ఈ రోజు ట్రై చేద్దాం. ముందుగా బల్లపరుపు నేలపై నిలబడి రిలాక్స్ అవ్వాలి. తర్వాత శరీరాన్ని ఎడమవైపు తిప్పి ఎడమ కాలిని ఒక అడుగు దూరం జరపాలి. ఇప్పుడు రెండు అరచేతులు జోడించి నమస్కారం చేస్తున్నట్లు చాతికి దగ్గరగా పెట్టుకోవాలి. తర్వాత శరీరాన్ని ఎడమవైపు కిందకు వాల్చాలి. మోకాలి ఎత్తులోపే ఉండేలా చూసుకోవాలి. అలాగే రెండు కాళ్లను ఎటూ కదలకుండా ఉంచి శరీరాన్ని సాధ్యమైనంత ఎడమవైపు తిప్పాలి. ఈ భంగిమలో కుడి మోచేయి ఎడమ మోకాలి దగ్గరగా ఉండాలి. కుడికాలు పాదం తూర్పువైపు, ఎడమ పాదం ఉత్తరంవైపు చూస్తుండాలి. ఇలా కాసేపు ఆగి మళ్లీ కుడివైపు చేయాలి.

ప్రయోజనాలు:

* జీర్ణక్రియ మెరుగుపరచడంలో సాయం

* ఆందోళన, ఒత్తిడి తగ్గిస్తుంది

* వెన్నునొప్పి, సయాటికా నుంచి ఉపశమనం

* శారీరక సమతుల్యతను పెంచుతుంది



Advertisement

Next Story

Most Viewed