- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాయ నాగరికత ప్రజలు ఎలా అంతరించిపోయారు ? మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు..
దిశ, ఫీచర్స్ : చరిత్ర వివిధ రకాల నాగరికతలతో నిండి ఉంది. వాటిలో ఒకటే మాయ నాగరికత. ఈ నాగరికత గురించి 2011-12 సంవత్సరంలో ఎన్నో చర్చలు జరిగాయి. నిజానికి 2012 సంవత్సరంలో ప్రపంచం నాశనం అవుతుందని మాయ నాగరికత క్యాలెండర్‌లో అంచనా వేశారు. ఇది జరగకపోయినా నేటికీ ఈ నాగరికత గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ నాగరికతకు చెందిన లక్షలాది మంది ప్రజలు ఈ భూమి పై నివసించేవారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు మాయ నాగరికత ప్రజలు ఎందుకు అంతరించిపోయారో కనుగొన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మాయ నాగరికత ప్రజలు గ్వాటెమాల, మెక్సికో, హోండురాస్, యుకాటన్ ద్వీపకల్పంలో నివసించారని నమ్ముతారు. యుకాటాన్‌లో చిచెన్ ఇట్జా అని పిలువబడే పురాతన మాయ నగరం శిధిలాలు కూడా ఉన్నాయి. ఈ గొప్ప నాగరికత క్రీస్తుపూర్వం 1500లో ప్రారంభమైందని, 16వ శతాబ్దంలో ఈ నాగరికత పూర్తిగా అంతరించిపోయిందని తెలిపారు. అయితే ఈ నాగరికత ఎలా అంతరించిపోయిందనే దాని పై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. యుద్ధం, అంటువ్యాధి కారణంగా మాయ నాగరికత అంతమైందని కొందరు నమ్ముతారు. మరికొందరు తమ స్థావరాల పై గ్రహాంతరవాసులు దాడి చేశారని చెప్పారు.
మాయ నాగరికత ఇలా నాశనం అయ్యింది..
కరువు కాటకాల వల్ల ఈ నాగరికత నాశనమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యవసాయానికి మార్గంగా, అందమైన నిర్మాణాలను నిర్మించడానికి ఇంధనంగా చాలా చెట్లను నరికివేసినట్లు ఒక అధ్యయనంలో తెలిపారు. దీంతో సౌర వికిరణాన్ని గ్రహించే భూమి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా తక్కువ నీరు ఆవిరైపోయింది. ఆ ప్రభావంతో తక్కువ మేఘాలు ఏర్పడతాయి. ఒక శతాబ్దం వ్యవధిలో 5-15 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యిందని తెలుపుతున్నారు.
కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, తక్కువ వర్షం కారణంగా, పంటలు దెబ్బతిన్నాయి. వ్యాపారం కూడా నష్టపోయింది. చివరికి వారికి ఆహారం దొరకక వారి ఉనికి ప్రమాదంలో పడిపోయింది. అలా క్రమంగా ఈ నాగరికత పూర్తిగా అంతరించిపోయిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.