ప్రేమ ఎంత మధురం?

by sudharani |   ( Updated:2023-02-14 04:21:07.0  )
ప్రేమ ఎంత మధురం?
X

దిశ, ఫీచర్స్: ''పూసే పూలు, వీచేగాలి, పారే సెలయేరు, ఎగసే కెరటాలు.. ప్రకృతిలోని అందాలన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు కదిలినా కలగని ఆనందం నిన్ను చూస్తే కలుగుతుంది. కానీ.. నువ్వు చేసిందేమిటి?'' ఓ భగ్న ప్రేమికుడి మనోవేదనిది. నీతో ఎన్నో చెప్పాలని కంప్యూటర్ కీ బోర్డుమీదికి చేతులను పోనిచ్చాను. కానీ ఫింగర్స్ ముందుకు కదలడం లేదు. వాలెంటైన్స్ డే రోజు నీతో ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలనుకున్న కానీ డైలమా వీడట్లేదు. ఏవేవో ఆలోచనలు, మరేవో సందేహాలు హృదయాంతరాలను స్పృశిస్తున్నాయి. ఒక వేళ నువ్వు కాదంటే ఏమై పోతానోననే భయం వెంటాడుతోంది... అందుకే అలా..'' ఓ యువతి కలం నుంచి ఆమె జ్ఞాపకాల డైరీలోకి జాలువారిన ప్రేమ ముత్యాలివి.

అవును ప్రేమలో అవన్నీ కామన్. అక్కడ సందేహాలు, సమస్యలు, సవాళ్లు, భావోద్వేగాలు ఉంటాయి. వేదనలు, విషాదాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కరి విషయంలో ఒక్కో అనుభవాన్ని మిగిల్చి ఆటాడుకుంటుంది ఇష్క్. ప్రేమలో పడితే మండు వేసవి కూడా పండు వెన్నెలైనట్లు ఫీలైతరు కొందరు. ప్రేమలో విఫలమైతే.. పండు వెన్నెల కూడా మండు వేసవై దహిస్తున్నట్లు రియాక్టైతరు మరి కొందరు. అందుకే ప్రేమల విషయంలో జాగ్రత్త సుమా.. అంటుంటారు పెద్దలు. ఆచితూచి అడుగేయాలని చెప్తుంటారు అనుభవజ్ఞులు. కొన్నాళ్ల అవసరం కోసమో, కోరికలు తీర్చుకోవడం కోసమో ప్రేమను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశ్రయించవద్దనే ప్రేమ పాఠాలు కూడా 'వాలెంటైన్స్ డే' చరిత్రలో కోకొల్లలు.

ప్రేమికుల రోజు.. వాలెంటైన్స్ డే పేరేదైనా దీని చుట్టూ అనేక అంశాలు ముడివడి ఉన్నాయి. వాలెంటైన్ జీవితానుభవాల ఆధారంగా పుట్టుకొచ్చిన ఈరోజు కొందరికి ఆమోదం యోగ్యమైతే.. మరి కొందరికి వికృత చేష్టగా తోస్తోంది. విచిత్రం ఏమిటంటే.. లవ్, వాలెంటైన్స్ డే గురించి అన్ని వాదనలకూ బలం చేకూర్చే ఆధారాలుంటాయి. అనుకూల, ప్రతికూల అభిప్రాయాలకు తగిన సందర్భాలు, సంఘటనలు, సన్నివేశాలు సినిమాల్లో, సమాజంలో, నిజ జీవితాల్లో మస్తు కనిపిస్తుంటాయి. అందుకే ప్రేమ ఎంత మధురం? అనే సందేహాలకు, కొందరి జీవితాల్లో అది నింపిన విషాదాలకు ఎవరి సమాధానం కరెక్టనేది చెప్పలేం. కానీ ఎవరి అభిప్రాయం వారు కలిగి ఉండవచ్చు. అందరి అభిప్రాయాలను గౌరవించడమే ఈ రోజుల్లో స్పెషాలిటీను. సో.. హాప్పీ వాలెంటైన్స్ డే !

స్వలింగ సంపర్కులదీ ప్రేమే...!! వారికీ వాలెంటైన్స్‌ డేలో చోటు కల్పిద్దాం!!

Advertisement

Next Story

Most Viewed