పాలు ఎన్ని రకాలు..! వాటిల్లో ఏఏ విటమిన్లు ఉన్నాయి?

by Anjali |   ( Updated:2024-10-05 12:50:29.0  )
పాలు ఎన్ని రకాలు..! వాటిల్లో ఏఏ విటమిన్లు ఉన్నాయి?
X

దిశ, వెబ్‌డెస్క్: పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అప్పుడే జన్మించిన బిడ్డకు కూడా ముందుగా పాలనే తాగిస్తారు. అయితే ఎన్నోరకాల పాలు ఎన్నో లాభాలను చేకూర్చుతాయి. ఎముకలను స్ట్రాంగ్‌గా ఉంచడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. కాల్షియం, ప్రొటీన్, విటమిన్ డి తో సహా ఎన్నో పోషకాలు అలెర్జీ సమస్యలను కూడా దూరం చేస్తాయి. కాగా పాలు ఎన్ని రకాలు..?వాటిలో ఏఏ విటిమన్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆవు పాలు..

ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆవు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిది. ఆవుపాలను ఎక్కువగా పిల్లలకు తాగిస్తుంటారు. 240 ml పాలలో 149 కేలరీలు ఉంటాయి. అంతేకాకుండా పాలల్లో 24% విటమిన్ D, 28% కాల్షియంతో పాటు 8 గ్రాముల ప్రోటీన్, కొవ్వు ఉంటుంది. అలాగే 12 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. 13% పొటాషియం ఆవుపాలల్లో ఉంటుంది. కాగా ఆవుపాలు హెల్త్ గా ఎంతో మేలు చేస్తాయి.

మేక పాలు..

మేక పాలల్లో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మనిషికి అత్యంత బలాన్ని చేకూరుస్తుంది. అలాగే 146 కేలరీలతో పాటు 23% కాల్షియం ఉంటుంది. 7.81 గ్రాముల కొవ్వు, 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మేకపాలల్లో 26 శాతం విటమిన్ బి2 అండ్ 55 శాతం విటమిన్ బి 12 ఉన్నాయి.

బాదం పాలు..

బాదం ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనారోగ్యంతో బాధపడుతోన్న వారు ఎక్కువగా బాదం పాలను తాగుతారు. బాదాన్ని వాటర్ లో నానబెట్టి.. మిక్సీ పట్టి.. వడగట్టి బాదం పాలను ఇంట్లోనే తయారు చేసుకుని తాగితే బోలెడన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆరోగ్య నిపుణులు చెప్పే దాని ప్రకారం.. బాదం పాలల్లో 2 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయి. అలాగే 240-మి.లీ పాలలో 41 కేలరీలు ఉండటంతో పాటు 50 శాతం విటమిన్ ఇ ఉన్నాయి. అలెర్జీ సమస్యలో బాధపడుతున్న వారు బాదం పాలను తీసుకుంటే సమస్యకు చెక్ పెట్టొచ్చు.

A2 పాలు...

దేశీ గిరి ఆవు పాలను ఎ2 పాలు అని అంటారు. వీటిలో ఎ2 ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఎ2 ప్రోటీన్ ను ఉత్పత్తి చేసే ఆవు పాల నుంచి వస్తుంది. దేశీ గిరి పాలల్లో ఎ1 ప్రోటీన్ ఉండదు. అలెర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మేలు.

వోట్స్ పాలు..

బరువు తగ్గాలనుకునే వారు వోట్స్ ఎక్కువగా తీసుకుంటారు. పైగా వీటితో అనేక ఆరోగ్యప్రయోజనాలు కూడా. అయితే తాజాగా ఆరోగ్య నిపుణులు వోట్స్ పాలు తీసుకుంటే ఎన్నో లాభాలున్నాయని.. వీటితో 240-మి.లీ సర్వింగ్‌లో 120 కేలరీలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే 5 గ్రా కొవ్వు తో పాటు 50 శాతం విటమిన్ బి12 అండ్ 46 శాతం రిబోఫ్లావిన్ ఉంటుందని అంటున్నారు. వీటితో పాటు 2 గ్రా ఫైబర్, 22శాతం ఫాస్పరస్ ఉంటుంది. 18% విటమిన్ డి అలాగే విటమిన్ ఎ వంటివి వోట్స్ లో అధికంగా ఉంటాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed