Health Benefits and Uses of Anise Seed.

by Prasanna |   ( Updated:2022-12-13 07:28:55.0  )
Health Benefits and Uses of Anise Seed.
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది భోజనం చేసిన తర్వాత..సోంపును తింటుంటారు. ఇది ఎందుకు తీసుకుంటారో తెలుసా. సోంపు మన ఆరోగ్యానికి చాలా మంచిది. మనం తిన్న ఆహారాన్ని తొందరగా అరిగేలా చేస్తుందంట. మన అందరి ఇంటిలో సోంపు ఉంటుంది. దీనిలో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి ఆరోగ్యకర పోషకాలు ఉంటాయి. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సోంపును ప్రతి రోజుకున్న చాలా మంచిది. ఎందుకంటే దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిలో ఉండే పొటాషియం మన గుండె పని తీరును మెరుగుపరుస్తుంది. కొంత మందికి ఒంట్లో వేడి ఎక్కువయ్యి .. నోటిలో పుండ్లు వస్తుంటాయి. అలాంటి వారు ఎంత ఎక్కువ తీసుకుంటే అంతమంచిది. ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. చూపు తక్కువుగా ఉన్న వారు రోజు తీసుకుంటే చూపు కూడా మంచిగా కనిపిస్తుంది.

Read More...

పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకూడదు


Advertisement

Next Story

Most Viewed