వ్యాయామం చేయాలనే కోరికను ప్రేరేపించవచ్చు.. మార్గాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

by Hajipasha |   ( Updated:2022-12-16 13:21:34.0  )
వ్యాయామం చేయాలనే కోరికను ప్రేరేపించవచ్చు.. మార్గాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్: పేగులోని నిర్దిష్టమైన బ్యాక్టీరియా వ్యాయామం చేయాలనే కోరికను ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకలలో గట్-బ్రెయిన్ మార్గాన్ని కనుగొన్న వారు.. అదే మార్గం మానవులలో నిర్ధారించబడితే మైక్రోబయోమ్‌ను సవరించడం ద్వారా ఎక్సర్‌సైజ్ చేయాలనే ప్రేరణను తీసుకురావచ్చని వివరించారు. పెరెల్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల బృందం.. గట్- వ్యాయామ ప్రేరణ మధ్య సాధ్యమయ్యే అనుబంధాలపై పరిశోధించి ఈ విషయాన్ని నిర్ధారించారు.

వ్యాయామం, గట్ బ్యాక్టీరియా మధ్య సంబంధం మైక్రో బయోమ్ పరిశోధన ప్రపంచంలో సాపేక్షంగా ప్రారంభ మూలాల్లో ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు 'గట్‌లో నివసించే సూక్ష్మజీవులు అథ్లెటిక్ పనితీరును ప్రభావితం చేస్తాయా?' అనే విషయంపై పరిశోధనలు నిర్వహించారు. 15 మంది ఎలైట్ మారథాన్ రన్నర్‌లపై సాగిన ఈ అధ్యయనం.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే అథ్లెట్లలో నిర్దిష్ట బ్యాక్టీరియా జాతులు ఎక్కువగా గుర్తించడమే కాకుండా.. రన్నర్‌ల మైక్రోబయోమ్‌లలో చమత్కారమైన మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపింది.

ఇటీవల అధ్యయనం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసింది. 'గట్ బ్యాక్టీరియా వ్యాయామం చేయాలనే ప్రేరణను ప్రభావితం చేస్తుందా?' అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు.. ఎలుకలపై యాంటీ బయోటిక్స్ చికిత్స చేశారు. తద్వారా గట్ బ్యాక్టీరియాను తొలగించిన తర్వాత ఆరోగ్యకరమైన ఎలుకలు వీల్‌పై పరిగెత్తడానికి ఆసక్తిని తగ్గించాయని పరిశోధనలో తేలింది. యాంటీ బయోటిక్ చికిత్స జంతువులు వ్యాయామం చేయడంలో 50 శాతం ఆసక్తిని తగ్గిస్తోందని, యూబాక్టీరియం రెక్టేల్, కోప్రోకోకస్ యూటాక్టస్ అనే బ్యాక్టీరియా జాతులు ఎక్కువగా వ్యాయామ ప్రాధాన్యతలను ప్రభావితం చేస్తున్నాయని గుర్తించారు.

ఎలుక మెదడును జూమ్ చేయడం ద్వారా పరిశోధకులు వ్యాయామం గట్-బ్రెయిన్ డోపమైన్ సిగ్నలింగ్ మార్గాన్ని ప్రేరేపించినట్లు కనుగొన్నారు. పెద్దపేగులోని ఇంద్రియ న్యూరాన్లు వ్యాయామం తర్వాత ప్రేరేపించబడ్డాయని, ఈ న్యూరాన్లు మెదడుకు సంకేతాలను పంపుతున్నాయని తేలింది. దీంతో కదలికను నియంత్రించే ప్రాంతమైన స్ట్రియాటమ్‌లో డోపమైన్ విడుదలకు దారితీసింది. రెండు రకాల బ్యాక్టీరియాలు ఫ్యాటీ యాసిడ్ అమైడ్స్ (FAAs) అని పిలువబడే జీవక్రియలను వ్యక్తపరుస్తాయి. ఈ అణువులు మెదడుతో కమ్యూనికేట్ అయ్యే గట్‌లోని ఇంద్రియ న్యూరాన్‌లను ప్రేరేపిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed