- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rakhi Festival : రాఖీ నాడు బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండాలా.. ఈ స్వీట్లను ఇంట్లోనే తయారు చేసుకోండి..
దిశ, ఫీచర్స్ : భారతదేశంలో ప్రతి ఒక్కపండగలో స్వీట్లు ఒక భాగంగా నిలుస్తాయి. తియ్యటి పలహారాలు లేకుండా అసలు పండగే పూర్తి కాదు. అందుకే పిల్లల నుంచి మొదలుకుని పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా స్వీట్లను రుచి చూస్తారు. పండగలలో మిఠాయిలు తింటూ కొందరు ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టరు. ఎవరైనా షుగర్ లేదా డయాబెటిక్ పేషెంట్లు స్వీట్లను అతిగా తింటే సమస్యలు ఎక్కవ అవ్వొచ్చు. ఇక రక్షాబంధన్ రానేవస్తుంది. ఈ పండగవేళ అతిగా స్వీట్లు తింటే షుగర్ అమాంతం పెరిగిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే స్వీట్లలో ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోవడం ముఖ్యం.
పంచదార లేకుండా చాలా రుచిగా ఉండే కొన్ని మిఠాయిలను ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఇలాంటి వాటిని తినడం వల్ల బరువు పెరుగుతుందనే ఆందోళన కూడా ఉండదు. మరి రాఖీని తియ్యగా జరుపుకోవడానికి ఏయే స్వీట్లు తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి లడ్డూలు..
రాగి లడ్డూల్లో ఐరన్, కాల్షియం, ఫైబర్, అనేక ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీన్ని ఒక సూపర్ ఫుడ్ అని కూడా పిలవొచ్చు. ఈ రక్షాబంధన్ కి ఇంట్లోనే రాగులు, బెల్లం లడ్డూలు చేసుకోవచ్చు. అందులో ఏలకులు, నెయ్యి వేయడం అస్సలు మర్చిపోవద్దు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. దీన్ని తినడం వల్ల షుగర్ లెవల్ పెరగదంటున్నారు డైటీషియన్లు. దీనికోసం ముందుగా రాగులను వేయించి పొడి చేసుకోవాలి. అందులో నెయ్యి, యాలకులు, బెల్లం పేస్ట్ కలపాలి. మీకు కావాలంటే, మీరు దానిలో గింజలను కూడా చేర్చవచ్చు. అలా చేసిన తర్వాత గుండ్రంగా లడ్డూలను తయారు చేసుకోవాలి.
ఖర్జూర బర్ఫీ..
సహజ చక్కెరతో కూడిన ఖర్జూరం ఎంతో అద్భుతమైనది. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. జీడిపప్పు, బాదం, వాల్‌నట్‌లను కూడా ఇందులో చేర్చుకోవచ్చు. బర్ఫీని చేయడానికి ముందుగా ఖర్జూరం పేస్ట్ చేసి అందులో నట్స్ వేసి వేడి చేయాలి. అది కాస్త చల్లారిన తర్వాత దాన్ని బర్ఫీగా కట్ చేసుకోవాలి.
ఓట్స్, ఆల్మండ్ పుడ్డింగ్..
రక్షాబంధన్ రోజున రెగ్యులర్ స్వీట్లకు బదులుగా హల్వాను కూడా ప్రయత్నించవచ్చు. ఈ రాఖీలో ఓట్స్, బాదం హల్వా చేయవచ్చు. దీన్ని చేయడానికి నెయ్యిలో ఓట్స్ వేయించి, దానికి రుబ్బిన బాదం పొడిని జోడించండి. కొద్దిగా వేగిన తర్వాత బెల్లం, యాలకులు, పాలు వేసి ఉడికించాలి. మీ టేస్టీ బాదం హల్వా రెడీ.