బట్టల పై టీ మరకలు పోవడం లేదా ఇలా ట్రై చేయండి..

by Sumithra |
బట్టల పై టీ మరకలు పోవడం లేదా ఇలా ట్రై చేయండి..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు ఒక్కసారైనా టీ తాగుతారు. అయితే కొన్ని సార్లు పొరపాటున కొన్ని టీ చుక్కలు పడి వాటి మరకలు అస్సలు పోవు. వాటిని పోగొట్టాలంటే యుద్ధంలో పోరాడటం కంటే తక్కువ ఏమీ కాదు. వాటిని రుద్ది వాష్ చేసేలోపే ప్రాణం పోయినంత పని అవుతుంది. అలాంటి మరకలను సులువుగా పోగొట్టుకునేందుకు ఈ సింపుల్ టిప్స్ మీ కోసం. మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయతో సింపుల్ టిప్..

టీ బట్టల పై పడితే మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీరు నిమ్మకాయ సహాయంతో బట్టల పై ఉన్న టీ మరకలను సులభంగా శుభ్రం చేయవచ్చు. దీని కోసం మీరు ముందుగా నిమ్మకాయను కట్ చేయాలి. ఇప్పుడు ఈ ముక్కను బట్టల పై పడిన మరకలు ఉన్న భాగంలో కొంత సమయం పాటు రుద్దాలి. దీని తర్వాత బట్టలను ఉతకాలి. నిమ్మకాయ మరకలను పోగొట్టేందుకు మంచి బ్లీచింగ్ ఏజెంట్ కాబట్టి టీ మరకను ఈజీగా తొలగిస్తుంది.

వెనిగర్..

బట్టల పై పడిన కఠినమైన మరకలు పడితే వాటి పై వెనిగర్ అప్లై చేసి టీ మరకలను శుభ్రం చేయవచ్చు. దీని కోసం మీరు ఒక బకెట్ నీటిని తీసుకోవాలి. అందులో సగం కప్పు వైట్ వెనిగర్ కలపాలి. ఇప్పుడు ఈ ద్రావణంలో మరకలు పడిన దుస్తులను సుమారు 20-25 నిమిషాలు నానబెట్టి తర్వాత వాటిని వాష్ చేయాలి. ఈ ట్రిక్ తో దుస్తులు పూర్తిగా శుభ్రంగా మారిపోతాయి.

మీరు నిమ్మకాయ, వెనిగర్ ఉపయోగించకూడదనుకుంటే బంగాళాదుంపలతో బట్టలు శుభ్రం చేయవచ్చు. దీనికోసం ముందుగా మీరు బంగాళాదుంపలను ఉడకబెట్టాలి. ఆ తర్వాత బంగాళాదుంపలను స్మాష్ చేయాలి. ఇప్పుడు పొట్టు తీసిన బంగాళదుంపలను ఒక గుడ్డ పై రుద్దండి. కొంత సమయం తర్వాత దుస్తులను ఉతికితే మరకలు మాయం.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు.

Advertisement

Next Story

Most Viewed