Ear pain: చెవి నొప్పితో బాధపడుతున్నారా.. ఈ ఇంటి చిట్కాలతో చెక్!

by sudharani |
Ear pain: చెవి నొప్పితో బాధపడుతున్నారా.. ఈ ఇంటి చిట్కాలతో చెక్!
X

దిశ, ఫీచర్స్: వర్షకాలం స్టార్ట్ అయింది మొదలు ప్రజలు ఏదో ఒక ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు. వాటిలో ముఖ్యంగా ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యేది దగ్గు, జులుబు, జ్వరంతో పాటు చెవి నెప్పి. జులుబు కారణంగా కూడా చెవి నొప్పి వస్తుంటుంది. అలాగే వర్షంలో తడవడం, చల్లగాలికి ఇలా వివిధ కారణాల చేత ఎక్కువ మంది చెవి నొప్పితో బాధపడుతుంటారు. అయితే.. అలాంటి వారు ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటంటే..

* వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మూడు వెల్లుల్లి రెబ్బలను వేడి చేసి, మెత్తగా దంచి, వస్త్రంలో చుట్టి నొప్పి ఉన్న ప్రదేశంలో పట్టు వేయాలి.

* అల్లం రసంతో నొప్పి ఉన్న ప్రదేశంలో మర్ధన చేయాలి.

* వేడి నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి, ఆవిరి పట్టడం వల్ల సైసస్‌లు శుభ్రమై చెవిపోటు తగ్గుతుంది.

నోట్: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా పాఠకుల అవగాహన కోసం ఇచ్చినది మాత్రమే. ఎలాంటి ఇన్ఫెక్షన్, విష జ్వరాలు వచ్చిన వెంటనే వైద్యుడుని సంప్రదించడం మంచిది.



Next Story

Most Viewed