కీటకాలతో కుకీస్.. భవిష్యత్‌లో ప్రొటీన్స్ ఇలాగే తీసుకోవాలా?

by sudharani |
కీటకాలతో కుకీస్.. భవిష్యత్‌లో ప్రొటీన్స్ ఇలాగే తీసుకోవాలా?
X

దిశ, ఫీచర్స్ : డెన్మార్క్‌కు చెందిన క్రౌన్ ప్రిన్స్ ఫ్రెడరిక్.. క్రికెట్ కుకీస్‌ను టేస్ట్ చేసిన వార్త వైరల్ అయింది. వాతావరణ మార్పు, ఆహార అభద్రతను ఎదుర్కోవడంలో భాగంగా ఈ ఇన్‌సెక్ట్(గ్రిలోయిడియా జాతికి చెందిన కీటకం) ఫుడ్ తిన్న ఆయన.. ప్రొటీన్స్‌కు ప్రత్యామ్నాయంగా కోసం కీటకాలను తీసుకోవచ్చనే విషయాన్ని సమర్థించారు. 'బగ్‌బాక్స్' అనే ఎస్టోనియన్ కంపెనీ తయారుచేసిన ఈ కుకీని స్థిరమైన ఆహారంపై నిర్వహించిన సిటిజన్ సస్టెయినబిలిటీ సమ్మిట్ సెషన్‌లో గ్రీన్‌ఫుడ్ సొల్యూషన్స్‌లో ఒకటిగా సమర్పించారు.

న్యూయార్క్‌లోని డానిష్ కాన్సులేట్ ద్వారా నిర్వహించబడిన 'సిటిజన్ సస్టెయినబిలిటీ సమ్మిట్' అనేది సుస్థిరత, జీవనోపాధి, సమగ్రతను కవర్ చేసే మూడు రోజుల కార్యక్రమం. డెసిషన్ మేకర్స్, సిటిజన్స్ మధ్య అంతరాన్ని తగ్గించడం దీని లక్ష్యం. కాగా ఆహార ఉత్పత్తి, వినియోగానికి సంబంధించిన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి మద్దతు ఇవ్వడంలో భాగంగానే క్రౌన్ ప్రిన్స్ వీటిని టేస్ట్ చేశాడు.

క్రికెట్‌లు భవిష్యత్తులో స్థిరమైన ఆహార వనరుగా ఉంటాయా?

సాధారణంగా ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కీటకాలను ఆహార వనరుగా భావిస్తారు. చౌకగా, స్థిరంగా, సులభంగా ఉత్పత్తి చేయగల పోషకాలతో పాటు ప్రొటీన్స్‌కు మూలంగా ఇవి ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచమంతా ఫ్యూచర్-ప్రూఫ్ ఫుడ్ సొల్యూషన్ కోసం వెతుకుతున్న క్రమంలో.. క్రికెట్‌లు వరల్డ్ వైడ్‌గా ఉన్న సూపర్‌మార్కెట్ షెల్ఫ్‌లలో సాధారణ దృశ్యంగా మారనున్నాయని అంచనా. ఇక 2050 నాటికి ప్రపంచ జనాభా 9.7 బిలియన్‌కు చేరనుండటంతో ఆహారోత్పత్తిని 60 శాతం పెంచాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలో కీటకాలు కీలకం కానున్నాయి. కాగా UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO) పరిశోధన ప్రకారం, క్రికెట్‌లకు అదే మొత్తంలో ప్రొటీన్‌ సృష్టించేందుకు పశువుల కంటే ఆరు రెట్లు తక్కువ మేత అవసరమవుతుంది. ఇవి 100gకి సమానమైన ప్రొటీన్ స్థాయిలను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed