- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుండెపోటును అంచనా వేస్తున్న హెయిర్
దిశ, ఫీచర్స్: మన జుట్టులో ఉండే స్ట్రెస్ హార్మోన్లు గుండెపోటు లేదా స్ట్రోక్‌ను ముందే అంచనా వేయగలదని తాజా అధ్యయనం చెప్తోంది. ఒత్తిడి హార్మోన్లు కార్టిసాల్, కార్టిసోన్ స్థాయిలు పెరిగిన వ్యక్తులు వారి జీవితకాలంలో స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి హృదయనాళ సంఘటనలను అనుభవించే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. కాగా 57ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి సంభావ్యత మూడు రెట్లు పెరుగుతుంది.
నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధనా బృందం కార్టిసాల్, కార్టిసోన్‌ను స్కాల్ప్ హెయిర్‌లో కనుగొంది. ఒక వ్యక్తి స్టెరాయిడ్ హార్మెన్ గ్లూకోకార్టికాయిడ్‌కు గురైనప్పుడు.. తర్వాతి నెలల్లో ఒత్తిడిని ఈ హార్మోన్స్ ఇండికేట్స్ చేస్తున్నాయని గుర్తించారు. కార్టిసాల్, కార్టిసోన్ శరీర జీవక్రియ, కొవ్వు పంపిణీని ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలిక హృదయ సంబంధ వ్యాధులపై కూడా వాటి ప్రభావం ఉంటుంది. అయితే ఈ విషయంపై మరింత లోతుగా తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు.. వయోజన పురుషులు, మహిళల నుంచి సేకరించిన 6,000 కంటే ఎక్కువ జుట్టు నమూనాలలో కార్టిసాల్ మరియు కార్టిసోన్ స్థాయిలను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న 167,000 మందిని దాదాపు ఏడేళ్లపాటు పరిశీలించారు. ఈ హార్మోన్స్ లెవల్స్, హృదయ సంబంధ వ్యాధుల మధ్య దీర్ఘకాలిక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అధ్యయన కాలంలో 133 హృదయ సంబంధ వ్యాధుల సంఘటనలు నివేదించబడగా.. ఎలివేటెడ్ కార్టిసాల్, కార్టిసోన్ స్థాయిలతో పాల్గొనేవారు వారి జీవితకాలంలో హృదయనాళ సంఘటనను అనుభవించే అవకాశం రెండింతలు ఉంటుందని వివరించారు. 57 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు ఈ ప్రమాదం మూడు రెట్లు పెరిగింది.
Also Read..