Heart burn : హఠాత్తుగా ఛాతీలో మంట..! వెంటనే రిలీఫ్ అవ్వాలంటే..

by Javid Pasha |
Heart burn : హఠాత్తుగా ఛాతీలో మంట..! వెంటనే రిలీఫ్ అవ్వాలంటే..
X

దిశ, ఫీచర్స్ : వెళ్తూ వెళ్తూనో.. మాట్లాడుతుండగానో కొందరికి హఠాత్తుగా ఛాతీ పైభాగంలో పిన్‌తో గుచ్చిన ఫీలింగ్ వచ్చి క్షణాల్లో మాయం అవుతుంది. మరికొందరికి మంటగా అనిపిస్తుంది. దీంతో తమకు ఏం జరిగిందోనని బాధితులు ఆందోళన చెందుతుంటారు. కాగా ఇది ప్రాణాంతకమైందేమీ కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కారం, ఉప్పు అధికంగా ఉన్న జంక్ ఫుడ్స్ (Junk foods), ఫ్రైడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడంవల్ల కూడా యాసిడ్ రిఫ్లక్స్ (Acid reflux) ఏర్పడి ఇలా జరుగుతుందట. అయితే వెంటనే ఉపశమనం కోసం కొన్ని హోమ్ రెమెడీస్ సహాయపడతాయి అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.

*బేకింగ్ సోడా : సాధారణంగా అందరి ఇండ్లల్లో ఇది వాడుతుంటారు. ఛాతీలో మంట వచ్చినప్పుడు ఓ టీ స్పూన్ బేకింగ్ సోడాను ఓ గ్లాస్ వాటర్‌లో కలిపి తాగాలి. ఇది శరీరంలో వెంటనే యాంటీ యాసిడ్ లక్షణాలను క్రియేట్ చేస్తుంది. తద్వారా మంట నుంచి ఉపశమనం కలుగుతుంది.

*అల్లం : యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అల్లంలో ఫుల్లుగా ఉంటాయి. దీనిని నీటిలో ఉడికించడం ద్వారా వచ్చే కషాయాన్ని తాగడంవల్ల కూడా ఛాతీలో మంట (Burning in the chest) తగ్గుతుంది. అలాగే అల్లంటీ తాగడంవల్ల జీర్ణ ఆరోగ్యానికి కూడా మంచిది.

*అరటి పండు : యాంటాసిడ్ లక్షణాలకు మూలం అరటి పండు అంటారు పోషకాహార నిపుణులు. ఇందులో నేచురల్‌గానే పొటాషియం ఉంటుంది. ఇది స్టమక్ యాసిడ్‌లను నిరోధిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు అరటి పండు (Banana) తింటూ ఉంటే యాసిడ్ రిఫ్లక్స్ నుంచి బయటపడవచ్చు. దీంతోపాటు కలబంద జ్యూస్, ఓట్ మీల్, సోంపు వాటర్ వంటివి కూడా ఛాతీలో మంట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story