- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heart Health : గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు.. వీటిని తింటే ఆ సమస్యలు కూడా దూరం!
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో గుండె జబ్బులు ప్రధానంగా ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, జన్యు సంబంధిత సమస్యలు కూడా ఇందుకు కారణం అవుతున్నాయి. కాబట్టి అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా గుండెకు మేలు చేసే ఆహారాలను తినడం కూడా సమస్య నుంచి బయటపడటంలో సహాయపడుతుందని చెప్తున్నారు. అవేమిటో చూద్దాం.
* బీట్ రూట్ : ఎర్లీ ఏజ్‌లో హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ముందుగా గుండె కండరాలు బలంగా ఉండాలి. రక్త ప్రసరణ సక్రమంగా జరగాలి. అందుకు సహాయపడే ఔషధ గుణాలు, ఫైబర్ కంటెంట్, ఇతర పోషకాలు బీట్ రూట్‌లో పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా బీట్ రూట్‌లో అస్పరాప్టిన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి ఇది రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండెకు మేలు జరుగుతుంది.
* టొమాటోలు : టొమాటోలు కూడా గుండె ఆరోగ్యానికి మంచిది. వీటిలో విటమిన్ సి తో పాటు లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్, ఇతర పోషకాలు ఉంటాయి. కార్డియో వాస్క్యులర్ హెల్త్‌ను, గుండె కండరాలను మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే గుండె జబ్బులు ఉన్నవారికి ఆహారంలో భాగంగా టమాటాలు తినాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తుంటారు.
* చిలగడ దుంప: చిలగడ దుంపలోనూ చాలా పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఫుల్లుగా ఉండటంవల్ల హార్ట్ హెల్త్‌కు మేలు చేస్తాయి. గుండె కండరాల బలోపేతానికి మంచిదని నిపుణులు చెప్తుంటారు. వీటితోపాటు అన్ని రకాల సీజనల్ వెజిటేబుల్స్ ఆహారంలో భాగంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే అన్నింటిలోనూ ఏదో ఒక స్థాయిలో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి అవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. దీంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ బీట్ రూట్, చిలగడ దుంప, టొమాటోలు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి సాధారణ జబ్బులు, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు దూరం అవడంలోనూ సహాయపడతాయి. ఇక వీటితోపాటు ప్రతిరోజూ కనీసం 30 నమిషాలు వ్యాయామం లేదా ఇతర శారీరక శ్రమను కలిగి ఉండటం గుండె జబ్బుల నివారణలో సహాయపడుతుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించగలరు.