- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చలికాలంలో గుండెపోటు.. ఆ లక్షణాలు ఉంటే డేంజరే..!
దిశ, వెబ్‌డెస్క్ : చలికాలం వచ్చిందంటే చాలు చిన్న పిల్లలు, ముసలివారు తరచూ ఏదో ఒక అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. అలాగే చాలా మంది శీతాకాలంలో గుండె సంబంధిత వ్యాధుల బారిన పడి గుండెపోటుకు గురవుతూ ఉంటారు. అయితే గుండెపోటు రావడానికి తరచూ కనిపించే లక్షణాలు కాకుండా శీతాకాలంలో అసాధారణ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తుపట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
శీతాకాలంలో గుండెపోటు వచ్చేముందు లక్షణాలు..
ఉదయాన్నే నిద్రనుంచి లేవగానే అలసటగా అనిపించడం, ఛాతీలో అసౌకర్యంగా ఉండడం, చలిలో ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం గుండెపోటుకు సంకేతం కావచ్చు. అలాగే నిద్ర లేవగానే తల తిరగడం, వికారం, చల్లని చెమటలు వస్తుంటాయి. దవడ లేదా మెడ నొప్పి తరచుగా రావడం, క్రమరహిత హృదయ స్పందన, ఛాతీలో దడ పుట్టడం. ఇలాంటి లక్షణాలు అన్ని కూడా గుండెపోటుకు సంకేతాలే అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తే వైద్య సహాయం పొందడం అవసరమని నిపుణులు పేర్కొన్నారు.