- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరోగ్యానికి మేలు చేసే క్యాబేజీ అట్లు తయారీ విధానం.. రుచి అదిరిపోవాల్సిందే?
దిశ, వెబ్‌డెస్క్: క్యాబేజీతో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. ఇది గట్ ఆరోగ్యాన్ని, జుట్టు పెరుగుదలను, బాడీలో ఇమ్యూనిటి పవర్‌ను పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. కానీ లిమిట్‌లో తీసుకోవడం మంచిది. లేకపోతే పలు దుష్ప్రభావాలను కలిగించే అవకాశాలు ఉంటాయి. క్యాబేజీ అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. క్యాబేజీలో విటమిన్లు, ఆరోగ్యానికి మేలు చేసే మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. క్యాబేజీ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గాయాలను నయం చేయడమే కాకుండా.. వాపును తగ్గించడంలో మేలు చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న క్యాబేజీతో అట్లు వేసుకుని తింటే రుచి అదిరిపోతుందనుకోండి. ఎప్పుడు ఆకలేసిన ఈజీగా తయారు చేసుకుని తింటే కడుపు నిండిపోతుంది. కాగా క్యాబేజీ అట్లు తయారీ విధానాన్ని చూసేద్దామా..?
క్యాబేజీ అట్లు తయారీకి కావలసిన పదార్థాలు..
పావు కేజీ క్యాబేజీ, రెండు అంగుళాల అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ, నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు, రెండు పచ్చిమిర్చి, పావు కప్పు నానబెట్టిన శనగపప్పు లేదా మూడు టీస్పూన్ల శనగపిండి, ఒక టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ మిరియాల పొడి, అరచెంచా పసుపు, టీస్పూన్ ఆవాలు, చిటికెడు ఇంగువ, బియ్యం పిండి 2 చెంచాలు, రుచికి సరిపడా ఉప్పు.
తయారీ విధానం..
ఫస్ట్ క్యాబేజీతో పాటు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోని, వెల్లుల్లి, అల్లంను దంచి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన క్యాబేజీలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం ముక్కలు, శనిగపిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు మిరియాల పొడి, జీలకర్ర, ఇంగువ, పసుపు, ఉప్పు వేయాలి. ఈ మిశ్రమం ముద్దగా అయ్యాక పెనంపై వేసి.. చేతులతో రౌండ్ గా ఒత్తాలి. ఇక ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చితే క్యాబేజీ అట్లు తయారైపోయినట్లే. కూరగాయలు నిండిన అల్పాహారం ఏదైనా సరే ఆరోగ్యకరమే కాబట్టి మీరు కూడా ఓసారి ట్రై చేయండి. రుచి బాగుంటుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.