Health : ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్..! మీలో ఆ లోపం ఉన్నట్లే!

by Javid Pasha |   ( Updated:2024-11-16 14:59:54.0  )
Health : ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్ ఫుల్..! మీలో ఆ లోపం ఉన్నట్లే!
X

దిశ, ఫీచర్స్ : చలికాలంలో చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్యల్లో కీళ్లు, నడుము నొప్పులు ఒకటి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. వింటర్‌లో కూల్ వెదర్ కారణంగా నొప్పి మరింత అధికం అవుతుంది. కండరాల కదలికల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. నరాలు, ఎముకల్లో బలహీనత వంటి హెల్త్ ఇష్యూస్ తలెత్తుతుంటాయి. వీటికి ప్రధాన కారణం కాల్షియం లోపమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే సమస్యను ముందుగానే గుర్తిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. కాబట్టి కాల్షియం లోపం కనిపించే లక్షణాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

* కూర్చోవడంలో ఇబ్బంది : కొద్దిసేపు కూర్చున్నా కాళ్లు, చేతులు, వీపు భాగం మొద్దుబారినట్లు అనిపిస్తే అది కాల్షియం లోపానికి సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు. అలాగే నోటి చుట్టూ తిమ్మిరి లేదా మొద్దు బారడం వంటి లక్షణాలు, నరాల మధ్య కమ్యూనికేషన్ లోపించిన అనుభూతి వంటివి కూడా కాల్షియం లోపంవల్ల తలెత్తే ఇబ్బందులే అంటున్నారు పోషకాహార నిపుణులు.

* ఎముకల బలహీనత : శరీరంలో కాల్షియం చాలా వరకు ఎముకల్లో, దంతాల్లో ఎక్కువ స్టోర్ అయి ఉంటుందని నిపుణులు అంటున్నారు. మీరు డైలీ తీసుకునే ఆహారం ద్వారా అది శరీరానికి అందుతుంది. అయితే సరైన లెవల్స్‌లో కాల్షియం అందకపోతే గనుక అప్పటికే ఎముకల్లో, దంతాల్లో స్టోర్ అయి ఉన్న కాల్షియాన్ని బాడీ యూజ్ చేసుకుంటుందని, దీనివల్ల అవి బలహీనంగా మారుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాలం ఈ పరిస్థితి కొనసాగితే బోలు ఎముకల వ్యాధి Osteoporosis) వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో చిన్న గాయాలైనా ఎముకలు విరగడం లేదా అధికంగా డ్యామేజ్ అవడం కాల్షియం లోపానికి సంకేతం.

* నిద్రలేమి : బాడీలో తగినంత కాల్షియం లేకుంటే రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నిద్రకు సహకరించే మెలటోనిన్ అనే హార్మోనల్ ఉత్తప్తికి కాల్షియం చాలా అవసరం. కాబట్టి కాల్షియం లోపం ఉన్నప్పుడు నిద్రా చక్రాన్ని కొనసాగించే మెటోనిన్ లెవల్స్ పడిపోతాయి. ఎక్కువకాలం ఇది కొనసాగితే నిద్రలేమి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

* కండరాల నొప్పి : కండరాల నొప్పికి కాల్షియం లోపం కూడా ప్రధాన కారణం. వాకింగ్, జాగింగ్, ఇతర వ్యాయామాలు చేసేటప్పుడు, ఆయా సందర్భాల్లో కదలికలవల్ల తొడ కండరాలు నొప్పిగా అనిపిస్తాయి. కాళ్లు, చేతులు, ముఖం ఇతర శరీర భాగాల్లో తిమ్మిర్లు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అధిక కాల్షియం లోపవంవల్ల కూడా ఇలా జరుగుతుందని, ఇలాంటప్పుడు డాక్టర్లను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

* దంతాల్లో సమస్యలు : కొందరికి చల్లని లేదా వేడి పదార్థాలు తింటున్నప్పుడు, పానీయాలు తాగుతున్నప్పుడు చిగుళ్లు జివ్వు మంటుంటాయి. వాపు, నొప్పి కూడా కనిపించవచ్చు. అలాగే గమ్ వ్యాధులు, పిప్పిపళ్లు వంటి తీవ్రమైన దంత సమస్యలు తలెత్తవచ్చు. ఇవన్నీ కాల్షియం లోపంవల్ల జరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

* త్వరగా అలసిపోవడం : వివిధ ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు అలసిపోవడం సహజం. కానీ ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా త్వరగా అలసిపోవడం, ఏదో మత్తు ఆవహించినట్లు అనిపించడం, శరీరంలో నిస్సత్తువ వంటివి కాల్షియం లోపానికి కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీర్ఘకాలం ఇది కొనసాగితే ఇతర అనారోగ్యాలు కూడా తలెత్తుతాయి.

* గోర్లు పెళుసుగా మారడం : కాళ్లు, చేతులకు ఉండే గోర్లు సహజంగానే పెరుగుతుంటాయి. అయితే వాటి పెరుగుదల మందగించడం, పెళ్లుసుగా మారడం, నల్లబారడం వంటి లక్షణాలు కనిపిస్తే కాల్షియం లోపం కూడా కావచ్చు. ఇలాంటప్పుడు వైద్య నిపుణులను సంప్రదించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. కాల్షియం లోపం ఉంటే దాని నివారణకు అవసరమైన ఆహారాలు తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు మందులు అవసరమైతే వాడాలి.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.


Read More...

ఈ ఒక్క ప్రాబ్లం లేకపోతే చాలు.. డైజెస్టివ్ హెల్త్ బాగున్నట్లే!





Advertisement

Next Story

Most Viewed