- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హఠాత్తుగా సిగరెట్ మానేస్తున్నారా.. జాగ్రత్త!
దిశ, ఫీచర్స్ : మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అంటారు. కానీ ఈ విషయాలను ఎవరూ పట్టించుకోరు. టీవీలో యాడ్స్, ఆఖరికి వారు తాగే సిగరేట్, మద్యం బాటిల్స్ పై కూడా ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు. అయినా కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ధూమపానం, మధ్యపానం చేస్తున్నారు. ధూమపానం చేయడం వల్ల ఆనారోగ్యానికి దారితీస్తుందని తెలిసి కూడా అలవాటు పడుతున్నారు. అయితే కొంత మంది పదే పదే తాగడం వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులను తీసుకొస్తుంది. దీంతో ఒక్కోసారి ఫ్యామిలీ గురించి ఆలోచించి, సడెన్‌గా సిగరేట్ లేదా బీడీ తాగడం మానేస్తారు.
అయితే హఠాత్తుగా సిగరెట్ తాగడం మానేయడం కూడా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందంట.అయితే రెగ్యులర్ గా సిగరెట్ తాగే వారు ఆకస్మాత్తుగా మానేస్తే వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
హఠాత్తుగా సిగరెట్ తాగడం మానేసిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సంవత్సరాల నుంచి స్మోకింగ్ చేయడం వల్ల శరీరంలో నికోటిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది మిమ్మల్ని సిగరెట్‌ల కోసం పరితపించేలా చేస్తుంది. దీంతో మీకు కొంత చిరాకు, మానసిక కల్లోలం కలిగిస్తుంది. ఇది మీ మానసిక స్థితిని ప్రభావితం చేయడమే గాకుండ చిరాకుతో కూడిన ఆందోళన, మూడ్ స్వింగ్‌లకు దారితీస్తుంది. కొందరు వ్యక్తులు ఆకస్మాత్తుగా ధూమపానం మానేసినప్పుడు వారు దృష్టిని కేంద్రికరించడం అనేది సవాలే అని చెప్పవచ్చు.
ధూమపానం చేసెటప్పుడు మీ శరీరంలో ఉండే నికోటిన్ ఆకలిని అణిచివేస్తుంది. కాబట్టి మీరు ధూమపానం మానేసినప్పుడు, మీరు మరింత ఆకలిని అనుభవించవచ్చు. దీనివల్ల కొందరిలో కొలస్ట్రాల్ అధికమై బరువు పెరగవచ్చు. ధూమపానం మానేయడం వల్ల మీ నిద్ర పై కూడ ప్రభావం చూపుతుంది. కొన్ని రోజుల వరకి మీ నిద్ర విధానాలకు భంగం కలిగిస్తూనే ఉంటాది. దీనివల్ల నిద్రపోవడం కష్టతరం చేస్తుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందువలన హఠాత్తుగా కాకుండా కొంచెం కొంచెంగా ఆ అలవాటు నుంచి బయటపడాలంట. రోజులో నాలుగు సార్లు తాగేవారు రెండు సార్లు తాగడం, కొన్ని రోజుల తర్వాత ఒకసారి తాగడం, తర్వాత మానేయడం ఇలా చేయాలంట. దీని వలన అది ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపదు అంటున్నారు నిపుణులు.
సిగరెట్ మానేయడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు?
ధూమపానం మానేసినప్పుడు మీ ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటం ప్రారంభమవుతుంది. దీంతో మీకు శ్వాస తీసుకోవడంలో ఏలాంటి అవాంతరాలు ఉండవు. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగడం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఇది మీ శరీరంలోని అవయవాలకు, కణజాలాలకు మెరుగైన ఆక్సిజన్ రిలీజ్ కు దారితీస్తుంది. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో సహా వివిధ ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ధూమపానం మానేసిన రోజు నుంచి ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, బరువు పెరగడాన్ని తగ్గించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఈ విధంగా మన శరీరం పై అనేక ఆరోగ్య ప్రయోజనలను కల్పిస్తాయి.