- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Drinking Water : శరీరానికి సరిపడా నీళ్లు తాగడం లేదా.. ఈ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు మరి..
దిశ, ఫీచర్స్: శరీరం ఫిట్‌గా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నీళ్లు కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తగిన మోతాదులో నీళ్లు తాగడం చాలా ముఖ్యం. నిజానికి ఒక వ్యక్తి ఆహారం కంటే కూడా నీటి పై ఎక్కువగా ఆధారపడతాడు.
తిన్న తర్వాత నీళ్లు తాగితేనే ఆకలి, దాహం పూర్తిగా తీరుతాయి. ఆహారం జీర్ణం కావడానికి నీళ్లు కూడా సహాయపడుతుంది. రోజు మొత్తంలో తక్కువ నీళ్లు తాగడం వల్ల కూడా జీర్ణ సమస్యలు వస్తాయి. అదే శరీరానికి సరిపడా నీళ్లు తాగడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
మంచి ఆరోగ్యానికి నీరు చాలా అవసరం. అయితే మీరు రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి, మీ కిడ్నీలు సక్రమంగా పనిచేయడానికి నీళ్లు ఎలా సహాయపడతాయి చాలా మందికి తెలియదు. అలాగే రోజులో ఎన్ని నీళ్లు తాగడం వల్ల వ్యాధుల నుండి దూరంగా ఉంటారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తక్కువ నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధులు..
శరీరంలో ఉండే టాక్సిన్స్‌ను తొలగించడానికి నీళ్లు ఎక్కువగా అవసరం. నీరు తాగడం ద్వారా టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోతాయి. శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోతే అది డీహైడ్రేషన్ సమస్యకు కారణం కావచ్చు. దీని కారణంగా, మీ జీర్ణశక్తి బలహీనంగా మారవచ్చు. దీంతో అజీర్ణం, కడుపు నొప్పి మొదలైన సమస్యలతో బాధపడవచ్చు. విషపూరిత పదార్థాలు శరీరం నుండి బయటకు రానప్పుడు, అది అనేక శరీర భాగాల పై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. దీని వల్ల కిడ్నీలు ఎక్కువగా దెబ్బతింటాయి. నీళ్లు తాగడం వల్ల మూత్ర విసర్జన కూడా తగ్గుతుంది. అంతే కాదు కిడ్నీలో రాళ్లు, యుటీఐ, కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. మెదడు, కిడ్నీలు సక్రమంగా పనిచేయాలంటే సరైన మోతాదులో నీళ్లు తాగడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
నీళ్లు లేకుండా ఎన్ని రోజులు బతకగలం..
జ్యూస్, శీతల పానీయం, మిల్క్ షేక్ లాంటివి కావాల్సినంత తాగొచ్చు కానీ నీళ్లు లేకుండా బతకలేం. నీరు సహజ పదార్థం. ఇది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. నిత్యం తక్కువ నీళ్లు తాగుతూ ఉంటే అలసట, బలహీనత, మైకం వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. వేసవి కాలంలో శరీరం హైడ్రేట్ గా ఉండాలంటే నీళ్లు చాలా అవసరమని చెబుతున్నారు నిపుణులు.
ఒక రోజులో ఎన్ని నీళ్లు తాగాలి...
వాస్తవానికి, రోజూ ఎంత నీరు త్రాగాలి అనేది వయస్సు, బరువు, సీజన్, పని మీద ఆధారపడి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం కోసం కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగటం చాలా ముఖ్యం. ఇంత నీరు తాగడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండదు. జీర్ణశక్తి కూడా బలంగా ఉంటుంది.
ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నీళ్లు తాగే అలవాటు ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల పొట్ట సరిగ్గా శుభ్రపడుతుందట. ఇతర వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుందట. కానీ ఆహారం తినే ముందు, తిన్న తర్వాత మాత్రం నీళ్లు ఎక్కువగా తాగకూడదు. భోజనం మధ్య కూడా నీళ్లు తాగకుండా ఉండాలి. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాదు.
వైద్యుడిని సంప్రదించాలి..
ఒక వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టైతే వాళ్లు ఎక్కువ నీళ్లు తాగకూడదు. ఎందుకంటే అది మూత్రపిండాల పై ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే అలాంటి వారు రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి అనే గురించి మీ వైద్యుడిని సంప్రదించాలి.
గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.