ఉదయాన్నే స్మార్ట్ ఫోన్ చూస్తున్నారా.. ఈ సమస్యల్లో పడ్డట్లే!

by Jakkula Samataha |
ఉదయాన్నే స్మార్ట్ ఫోన్ చూస్తున్నారా.. ఈ సమస్యల్లో పడ్డట్లే!
X

దిశ, ఫీచర్స్ : యువతపై స్మార్ట్ ఫోన్ ప్రభావం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతీ ఒక్కరూ ఫోన్‌కే అడెక్ట్ అయ్యారు. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చేతిలో పట్టుకుంటే రాత్రి 12 వరకు అది అలానే ఉంటుంది. ఏ చిన్న అవసరానికైనా మొబైల్‌ఫోనే ఎక్కువగా వాడుతున్నారు.

అయితే ఇలా ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ వాడకూడదు. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరించినా ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది. ఉదయం సరిగ్గా కళ్లు కూడా తెరవక ముందే ఫోన్ చూస్తున్నారు.ఇలా ఫోన్ చూడటం వలన ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందంట.

కాగా, మార్నింగ్ లేవగానే ఫోన్ చూడటం వలన కలిగే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవారు జామున్నే స్మార్ట్ ఫోన్ చూడటం వలన ఒత్తిడీ, ఆందోళన లాంటిది ఎక్కువ కలుగుతుందంట. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడటం వలన మనకు తెలియకుండానే మనం అతిగా ఆలోచించడం మొదలు పెడుతామంట. అలాగే మనం చేయవలసిన పనులు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. కొన్ని పెండిగ్ వర్స్ ఉంటాయి. వీటన్నింటి చూసి ఆందోళనకు, టెన్షన్‌కు గురికావాల్సి వస్తుందంట.అందువలన ఉదయాన్నే స్మార్ట్ ఫోన్ చూడకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Advertisement

Next Story