Curry leaves : కరివేపాకును ఈజీగా తీసిపడేయకండి.. తింటే ఎన్ని లాభాలో తెలుసా?

by Javid Pasha |
Curry leaves : కరివేపాకును ఈజీగా తీసిపడేయకండి.. తింటే ఎన్ని లాభాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : చిప్స్, పాపడ్స్, శాండ్ విచ్, పిజ్జా, బర్గర్లు వంటివి మనం ఇష్టంగా తినేస్తుంటాం. కానీ కూరలో కరివేపాకును మాత్రం తీసి పడేస్తుంటాం. ఇక్కడ మొదటిరకం ఆహారాలు అనారోగ్యకరం, ఇక రెండవ రకం అయిన కరివేపాకు మాత్రం ఆరోగ్య దాయకం.. ఈ విషయం తెలిసో తెలియకో చాలామంది కరివేపాకును నిర్లక్ష్యం చేస్తుంటారు. లేనిపోని అనారోగ్యాలను కొనితెచ్చుకుంటుంటారు. చిన్న సమస్యకే వందలు, వేలు ఖర్చు చేసి మందులు వాడేస్తుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే.. మీ ఆహారంలో భాగంగా కరివేపాకును తప్పక చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* కూరలో తప్పకుండా వాడే ముఖ్యమైన పదార్థాల్లో కరివేపాకు ఒకటి. దీనివల్ల కమ్మని వాసన, రుచి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు కరివేపాకు లేదనో, ఉన్నా దాని బెనిఫిట్స్ గురించి తెలియకపోవడంవల్లనో పక్కన పెట్టేస్తుంటారు. అలాగే కూరల్లో వేసినా దానిని తినకుండా పడేస్తుంటారు. కానీ దీనివల్ల చాలా నష్టం పోతాం.

* కరివేపాకులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియకు దోహదం చేసే ఎంజైములను విడుదల చేయడంలో ఇది కీ రోల్ పోషిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అయి అందులోని పోషకాలు శరీరానికి అందడంలో, అధిక బరువు తగ్గడంలో కరివేపాకు ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కడుపు నొప్పి, గ్యాస్ట్రరైటిస్, జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కరివేపాకు సహాయపడుతుంది.

* ఫైబర్ కంటెంట్ కలిగి ఉండటంవల్ల అతి ఆకలిని తగ్గించడంలోనూ కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒబేసిటీతో బాధపడేవారు ఆహారంలో భాగంగా తరచుగా వాడటంవల్ల అనారోగ్యాలకు గురికాకుండా ఉంటారు. అలాగే బరువు తగ్గుతారు. ఇక డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఇది మెడిసిన్‌లా పనిచేస్తుందని చెబుతారు. కరివేపాకులో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే గుణాలు ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించగల సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, బయో యాక్టివ్ పదార్థాలు ఉండటంవల్ల అన్ని విధాలా మేలు జరుగుతుంది.

*విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ వంటివి కరివేపాకులో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా కాల్షియం, ఐరన్మెగ్నీషియం, ఫాస్పరస్, జించ్, ఫైబర్ వంటి పోషకాలతోపాటు విటబమిన్ బి, విటమిన్ సిర, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. కరివేపాకు తినడంవల్ల శరీరంలో రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కరివేపాకు జుట్టు రాలే సమస్యకు, హార్మోన్ల అసమతుల్యతకు కూడా చెక్ పెడుతుంది. కాబట్టి కరివేపాకు, కరివేపాకు పొడిని కూరల్లో, వివిధ ఆహార పదార్థాల్లో ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Next Story

Most Viewed