Herbal tea: ఈ హెర్బల్‌ టీతో బోలేడు హెల్త్ బెనిఫిట్స్..!

by Kanadam.Hamsa lekha |   ( Updated:2024-11-17 11:48:04.0  )
Herbal tea: ఈ హెర్బల్‌ టీతో బోలేడు హెల్త్ బెనిఫిట్స్..!
X

దిశ, ఫీచర్స్‌: చాలామంది ఉదయాన్ని ఒక కప్పు టీతో ప్రారంభిస్తారు. కొందరు బెడ్‌ టీ లేదా కాఫీ అని తాగేస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతీ ఒక్కరికి టీ తాగే అలవాటు ఉంటుంది. కార్యాలయాల్లో ఉద్యోగుల నుంచి కార్మికుల వరకు టీ తాగనిదే ఎవ్వరూ పనిని ప్రారంభించరు. ఇది బాడీని రిఫ్రెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే అందరూ టీ తాగేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, ఈ టీలో అనేక రకాలు ఉన్నాయి. ఇవి మంచి పరిమళంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎల్లో టీ, గ్రీన్, బ్లాక్, వైట్ టీలు స్వచ్ఛమైన తేయాకుతో తయారు చేస్తారు. అయితే, టీలో ఎన్ని రకాలు ఉన్నాయి.. వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

గ్రీన్ టీ: ఇందులో ఫాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మ సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండెకు మేలు చేస్తుంది.

బ్లాక్ టీ: బ్లాక్ టీలోని యాంటీఆక్సిడెంట్లు, ఇతర సమ్మెళనాలతో కలిగి ఉంటాయి. దీనిని రోజూ తాగడం వల్ల ముఖంలో మంటను తగ్గిస్తుంది. శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది.

వైట్ టీ: ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కమీలియా సినెన్సిస్ అనే మొక్క ఆకులు, పువ్వులతో చేసే టీ. ఈ నేచురల్ టీ రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్య ఛాయలు రాకుండా చేసి, బరువును తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఊలాంగ్ టీ: ఈ ఊలాంగ్ టీ సాంప్రదాయ చైనీస్ టీ. దీనిని ప్రతి రోజూ తాగడం వల్ల జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫాలీఫినాల్స్ కొవ్వును బర్న్ చేసి, బరువు తగ్గేలా చేస్తుంది. ఎసిడిటీ ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థను మెరుగుపరిచి, ఏకాగ్రతను పెంచుతుంది.

చమోమిలే టీ: ఇది ప్రంపవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించే టీలలో ఇది ఒకటి. ఈ చమోమిలే టీ ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. శరీరాన్ని, మనస్సును రిలాక్స్ చేస్తుంది.

అల్లం టీ: అల్లం టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. అల్లం టీలో ఉండే ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ ఉన్నవారకి సహాయపడుతుంది.

లెమన్ బామ్ టీ: ఇది ఆందోళనను తగ్గించే మంచి టానిక్‌గా చెప్పవచ్చు. ఒత్తిడి, నిద్రలేమి సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థ, మెదడు పనితీరును ప్రభావితం చేసి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

ఇలా లావెండర్, సోరెల్‌ టీ నిద్రలేమి, జీర్ణక్రియ సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. మందార టీలోని యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి మేలు చేస్తాయి.

Advertisement

Next Story

Most Viewed