Health benefits : నానబెట్టిన బాదం తొక్కలతో అద్భుతం.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

by Sumithra |
Health benefits : నానబెట్టిన బాదం తొక్కలతో అద్భుతం.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : నూటికి 90 శాతం మంది నానబెట్టిన బాదం పప్పును తొక్క తీసి తింటుంటారు. కానీ అలాంటి పొరపాట్లు చేయకూడదంటున్నారు నిపుణులు. నానబెట్టిన బాదం తొక్కలో ఎన్నో శక్తివంతమైన లక్షణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి మీ మెదడుకు చాలా ముఖ్యమైనవి చెబుతున్నారు. అంతే కాదు ఇది టైప్ 2 డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. బాదం పప్పును పొట్టుతో కలిపి తింటే కలిగే మరిన్ని ప్రయోజనాలను ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం తొక్కలతో కలిగే ప్రయోజనాలు..

ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు చాలామంది బాదంపప్పు తింటారు. ఇందులో ప్రోటీన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ ఉంటాయి. బాదంపప్పును తరచుగా నానబెట్టి తొక్క తీసి తర్వాత తింటారు. దాని పై తొక్క పారేస్తుంటారు. కానీ బాదం తొక్కలు శరీర సామర్థ్యాలను పెంచే ఆరోగ్యకరమైన లక్షణాలను కలిగి ఉన్నాయని చాలా మందికి తెలిసి ఉండదు. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెదడుకు చురుకుదనం..

కొన్ని పరిశోధన ప్రకారం బాదం తొక్కలలో పుష్కలంగా పాలీఫెనాల్స్ కలిగి ఉంటాయి. ఇది మీ దృష్టిని, జ్ఞాపకశక్తిని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌కి కూడా ఇది మంచి పరిష్కారమంటున్నారు.

ఇన్సులిన్ పెరగడానికి..

బాదం తొక్కలలో ఉండే పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. టైప్ 2 డయాబెటిస్‌లో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో పాలీఫెనాల్స్ సహాయపడతాయి.

hdl కొలెస్ట్రాల్..

పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది గుండె దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు పాలీఫెనాల్స్ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి.

రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది..

శరీరంలో రక్తం గడ్డకట్టడం చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. దీని వల్ల రక్తప్రసరణ ఆగిపోయి గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. కానీ పాలీఫెనాల్స్ రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది..

పాలీఫెనాల్స్ మీ జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఇవి పేగులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచడంలో ప్రభావవంతంగా పని చేస్తాయని రుజువు చేస్తుంది. దీని కారణంగా మలబద్ధకం, GERD, యాసిడ్ రిఫ్లక్స్ నిరోధిస్తుంది.

క్యాన్సర్ నివారణ..

ఇటీవల కొన్ని పరిశోధనలు పాలీఫెనాల్స్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని సూచించాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నుండి రక్షిస్తాయి.

బాదం తొక్కలను ఎలా తినాలి ?

బాదం తొక్కలను తినడానికి మీరు ప్రత్యేక పద్ధతిని అవలంబించవలసిన అవసరం లేదు. నానబెట్టిన బాదం పప్పులను పొట్టు తీయకుండా తినవచ్చు. ఈ విధంగా, మీరు బాదం, వాటి పీల్స్ రెండింటి ప్రయోజనాలను పొందుతారు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed