గాడిద పాలతో ఎన్నో లాభాలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anjali |   ( Updated:2023-04-03 08:08:39.0  )
గాడిద పాలతో ఎన్నో లాభాలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: గాడిద పాల వినియోగం అని వినగానే ముందుగా గుర్తొచ్చేది ఈజిఫ్ట్ మహారాణి క్లియోపాత్రా. ఆమె రోజు గాడిద పాలతోనే స్నానం చేసేదని అంటుంటారు. అందుకని ప్రపంచ సుందరిగా పేరుగాంచినది అని నమ్మకం. ఇటువంటి కారణాలచేతనే గాడిద పాలతో సబ్బులు అనగానే, సౌందర్యారాధకుల కళ్ళు దీనిమీద పడ్డాయని చెప్పవచ్చు. పైగా శాస్త్రీయంగా గాడిద పాలలో చర్మ సౌందర్యానికి ఉపయోగపడే నిక్షేపాలు కూడా ఉన్నాయి. అలాగే గాడిద పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలు తాగితే రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అందుకే ఈ పాలల్లో ఉండే ఔషధ గుణాలు తల్లి పాలలో ఉండే ఔషధ గుణాలకు చాలా దగ్గరగా ఉంటాయట. అందువల్లే గాడిద పాలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో చుద్దామా..

* గాడిద పాలలో లాక్టోస్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక సహజ శక్తి వనరు. వేసవిలో గాడిద పాలు తాగడం చాలా మంచిది. అథ్లెట్లకు లేక శారీరక శ్రమ చేసేవారికి చాలా మేలు చేస్తాయి.

* పాలలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, బి1, బి2, బి6, సి, డి, అలాగే ఆరోగ్యకరమైన చర్మాన్ని అందించే విటమిన్-ఇ కూడా గాడిద పాలలో సమృద్ధిగా లభిస్తుంది.

* ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల చర్మపు చికాకును తగ్గించడం, చర్మ ముడతలు తగ్గించడం లాంటి వాటికి సహాయపడతాయి.

* గాడిద పాలు తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటుంది. ఈ పాలు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తాయి.

* గాడిద పాలను ఫార్మాస్యూటికల్స్, సౌందర్య సాధనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. పురాతన కాలంలో రుమాటిజం, దగ్గు, గాయాలకు చికిత్సగా వాడేవారు. గాడిద పాలలో యాంటీమైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆఫ్రికాతో పాటు భారత్ లో గాడిద పాలను దగ్గుకు, ఇతర వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు.

ఆవులు, మేకలు, గొర్రెలు, గేదెలు, ఒంటెలు వంటి ఇతర జంతువుల పాలతో పోలిస్తే గాడిద పాల వల్లే అధిక లాభాలు ఉన్నాయని తెలుస్తోంది. అందుకే 19వ శతాబ్దంలో అనాథ శిశువులకు తల్లి పాలకు బదులు గాడిద పాలు ఇచ్చేవారని హెల్త్‌లైన్ కామ్‌లో ప్రచురించిన కథనం పేర్కొంది.

Read more:

ఆవు పాలు, గేదే పాలల్లో ఏవి ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed