పిల్లల్లో మలబద్ధకాన్ని నివారిస్తున్న చాక్లెట్స్

by Sujitha Rachapalli |
పిల్లల్లో మలబద్ధకాన్ని నివారిస్తున్న చాక్లెట్స్
X

దిశ, ఫీచర్స్: పిల్లలకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఎక్కువ తింటే పళ్లు పుచ్చిపోవడంతోపాటు అనారోగ్యాలు దరిచేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తారు పెద్దలు. అయితే వీటిని మితంగా రోజూ తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి వివరిస్తున్నారు నిపుణులు. లిటిల్ చాక్లెట్ వండర్స్ చేస్తుందని చెప్తున్నారు.

  1. ఇందులో పుష్కలంగా ఉండే న్యూట్రియెంట్స్, యాంటీ ఆక్సిడెంట్లు.. మూడ్ బూస్టర్లుగా పని చేస్తాయి. కాగ్నిటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసి తెలివితేటలను పెంచుతాయి.
  2. చాక్లెట్ లోని ఫ్లేవనాయిడ్లు బ్రెయిన్ ఫంక్షన్ ను పెంచుతాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. రక్త ప్రవాహాన్ని పెంచి మెమోరీ పవర్ పెరిగేలా చేస్తాయి. బ్లడ్ ప్రెషర్ తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.
  3. ఇందులోని సెరోటోనిన్, ఫినైల్ఇథైలమైన్ మూడ్ బూస్ట్ చేస్తాయి. ఒత్తిడి, ఆందోళన లక్షణాలను తగ్గిస్తాయి.
  4. ఇక కెఫిన్ క్విక్ ఎనర్జీ బూస్టర్ గా పని చేస్తుంది. ఫిజికల్ యాక్టివిటీలో పిల్లలు త్వరగా శక్తి పొందేలా చేస్తుంది.
  5. మెగ్నీషియం, ఐరన్, జింక్ ఖనిజాలు కలిగిన చాక్లెట్.. ఇమ్యూన్ రెస్పాన్స్, ఆక్సిజన్ ట్రాన్స్ పోర్ట్, ఎంజైమ్ రియాక్షన్ లో హెల్ప్ అవుతుంది.
  6. డైటరీ ఫైబర్ కలిగిన డార్క్ చాక్లెట్ జీర్ణక్రియ సరిగ్గా జరిగేలా చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
Advertisement

Next Story

Most Viewed