కారులో వాటర్ బాటిల్ పెట్టి మర్చిపోయారా?.. రిస్కులో పడ్డట్టే!

by Javid Pasha |   ( Updated:2024-06-24 15:59:37.0  )
కారులో వాటర్ బాటిల్ పెట్టి మర్చిపోయారా?.. రిస్కులో పడ్డట్టే!
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా జర్నీ చేసేటప్పుడు దాహం వేస్తే తాగడానికంటూ వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్తుంటాం. బస్సుల్లో, ట్రైన్లలో అయితే వాటర్ తాగాక సీటు పక్కన ఉండే డ్రాలో బాటిల్ పెట్టేసి మర్చిపోతుంటాం. అయితే కారులో వెళ్లినప్పుడు మాత్రం వాటర్ బాటిల్ అందులోనే పెట్టి మర్చిపోతే మాత్రం రిస్కులో పడ్డట్టే అంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం.

వాస్తవానికి నీటికి మంటలను ఆర్పే గుణం ఉంటుంది. కానీ అదే నీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో ఉన్నప్పుడు, దానిని కారులో పెట్టి ఎండలో పార్కు చేస్తే గనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందట. ఎందుకంటే ఆ బాటిల్‌పై ఎండపడినప్పుడు అది మెత్తగా, సన్నగా మారుతుంది. తర్వాత సూర్య కిరణాలు అందులోని నీటిని వేడెక్కించడం ద్వారా కారు లోపలి సీట్ కవర్లు, డ్యాష్‌బోర్డులు మొదలైన వాటితో కూడిన లెదర్ భాగాలలో రసాయనిక చర్యలకు కారణం అవుతాయి. దీంతో మంటలు చెలరేగే చాన్స్ ఉంటుంది. అలా జరగకూడదంటే కారును ఎండలో పార్కు చేయవద్దు, ఒకవేళ చేస్తే అందులో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉండకుండా చూడాలి. వీటితోపాటు పెర్ఫ్యూమ్ బాటిల్స్, లైటర్స్, ఇతర సువాసనల బాటిల్స్ కారులో ఉంచడం ప్రమాదకరం.

Advertisement

Next Story

Most Viewed