Anjeer Halwa: అంజీరాతో హల్వా.. రుచి మాత్రమే కాదు బోలెడు హెల్త్ బెనిఫిట్స్

by Anjali |
Anjeer Halwa: అంజీరాతో హల్వా.. రుచి మాత్రమే కాదు బోలెడు హెల్త్ బెనిఫిట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హల్వా అంటే ఇష్టపడని వారు ఉండరు. ఎన్నో రకాలుగా తయారు చేసుకుని తినే ఈ హల్వా అంటే చాలా మంది ఇష్టపడుతారు. ఇది స్వీట్‌గా, ఎంతో టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. స్వీట్ తినాలనిపించినప్పుడు అతి తక్కువ సమయం తీసుకునే హల్వా తయారు చేసుకోండి. హల్వాలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంజీరా హెల్త్‌కు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అంజీరా ఆరోగ్య ప్రయోజనాలు..

ఎండు అంజీర్ లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అలాగే కొద్ది స్థాయిలో కొవ్వులుంటాయి. ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రిండచంలో కీలక పాత్ర పోషిస్తాయి. హర్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్ దరి చేరనియకుండా చేస్తాయి. అంతేకాకుండా అంజీరాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇమ్మూనిటి పవర్‌ను పెంచడంలో సహాయపడతాయి.

అయితే ప్రతిసారి రొటిన్‌గా కాకుండా హల్వాను ఈసారి అంజీరాతో ట్రై చేయండి. రుచి అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారనుకోండి.. మళ్లీ మళ్లీ తినాలనిపిస్తోంది. రుచికరమైన అంజీరా హల్వా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

అంజీర్ హల్వాకు కావాల్సిన పదార్థాలు..

సగం కప్పు పంచదార లేదా పటిక బెల్లం పొడి, పావు కప్పు బాదం, కలర్ ఆప్షన్, అంజీర్, కోవా, జీడిపప్పు, నెయ్యి, 1 టీస్పూన్ యాలకుల పొడ, పావు కప్పు నెయ్యి, 1 టీస్పూన్ కుంకుమ పువ్వు (ఆప్షనల్).

అంజీర్ హల్వా తయారీ విధానం..

ముందుగా అంజీరాలను శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత గోరువెచ్చని వాటర్‌లో అంజీరాలను ఒక గంటసేపు నానబెట్టుకోవాలి. మరో చిన్న గిన్నె తీసుకుని బాదం పప్పును కూడా నానబెట్టాలి. ఇప్పుడు బాదంను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. తర్వాత మరిన్ని గోరువెచ్చని వాటర్‌లో కుంకుమ పువ్వు కలిపి సైడ్ కు అలా ఉంచుకోవాలి. తర్వాత నానబెట్టిన అంజీరాను ముక్కులుగా కట్ చేసి మెత్తగా మిక్స్ పట్టాలి. గ్యాస్ ఆన్ చేసి కడాయిలో నెయ్యి వేసుకోవాలి.

గ్యాస్ సిమ్‌లో ఉంచి.. నెయ్యి వేడి అయ్యాక అంజీరా మిశ్రమాన్ని కడాయిలో వేసుకోండి. ఒక 10 మినిట్స్ నెయ్యిలో కలపండి. తర్వాత కోవా వేసి రెండు నిమిషాలయ్యాక సరిపడా పంచాదార, కుంకుమ పువ్వు వాటర్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం గట్టిపడ్డాక కట్ చేసి ఉంచిన బాదం, యాలకుల పొడి యాడ్ చేయాలి. అంతే అంజీరా హల్వా తయారైనట్లే. ఈ అంజీరా హల్వాను ఒక్కసారి తిన్నారంటే మీ ఫేవరెట్‌గా మారిపోతుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed