- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Childrens: పిల్లల మెదడుపై ప్రభావం చూపే అలవాట్లు..!
దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రులు ముందుగా పిల్లల ఆరోగ్యం గురించే ఆలోచిస్తారు. పిల్లలకు కొంచెం ఫీవర్ రాగానే ఆందోళన చెందుతారు. వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం వైద్యులు సూచించిన నాణ్యమైన ఆహారాన్ని అందిస్తారు. ప్రస్తుత రోజుల్లో పోషకాహార కొరత వల్ల పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడం లేదు. పిల్లల మైండ్ కంప్యూటర్‌లా పని చేయాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. కానీ పిల్లల మెదడు పనితీరును దెబ్బతీసే పాడు అలవాట్లు ఇవేనంటూ తాజాగా నిపుణులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
భయపెట్టే ఘటనలు...
భయపెట్టే ఘటనలు పిల్లల మెదడుపై ప్రభావాన్ని చూపుతాయి. ఏదైనా నెగిటివ్ వార్త వినడం కారణంగా, చూడడం వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతుంది. ఎప్పుడైనా సరే పిల్లల్ని ఒంటరిగా వదిలేయవద్దు. ఒంటరితనం పిల్లల్లో డిప్రెషన్‌కు కారణం అయ్యే అవకాశం ఉంటుంది.
అధిక శబ్దాలు..
శబ్దాలు ఎక్కువగా ఉన్న చోట పిల్లల్ని అస్సలు ఉంచకూడదు. అధిక శబ్ధం పిల్లల మెదడుపై ఎఫెక్ట్ పడుతుంది. ఇక అందరికీ ఎంతో ఇష్టమైన అలవాటు ఫోన్ వాడకం. ఈ మధ్యకాలంలో మొబైల్ వాడటంలో పిల్లలు ఆరితేరిపోయారు. కాగా ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే పిల్లల కంటిపై, మెదడుపై చెడు ప్రభావం చూపుతుంది.
సరైన నిద్ర లేకపోవడం..
అంతేకాకుండా సరిగ్గా నిద్రపోకపోవడం కారణంగా , రోజంతా ఇంట్లోనే ఉండడం వల్ల పిల్లల మెదడు పనితీరు మందగిస్తుంది. ఇది ఊబకాయం సమస్యకు కూడా దారితీస్తుంది. కాగా కాసేపు ప్రశాంతంగా ఆడుకోనివ్వాలి.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.