- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతున్న ఇండోర్ ప్లాంట్స్.. గాలిలో కలుషితాలను తొలగించడంలో పర్ఫెక్ట్
దిశ, ఫీచర్స్: బయటి గాలి కంటే ఇండోర్ ఎయిర్ నాణ్యత తరచుగా కలుషితమైంది. క్యాన్సర్, లంగ్స్ ఇన్‌ఫెక్షన్స్, ఆస్తమా, తలనొప్పి, వికారంతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. పేలవమైన ఇండోర్ గాలి నాణ్యత ప్రపంచవ్యాప్తంగా 6.7 మిలియన్ల అకాల మరణాలకు కారణం అవుతుంది. కాబట్టి గాలి నాణ్యతను మెరుగుపరచడానికి కొత్త వ్యూహాలను అనుసరించడం చాలా అవసరం. కాగా ఈ అంశంపై ప్రముఖ ఆస్ట్రేలియన్ ప్లాంట్‌కేపింగ్ సొల్యూషన్స్ కంపెనీ అంబియస్, యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ చేసిన అధ్యయనం గుడ్ న్యూస్ అందించింది. ఇంట్లో మొక్కలను పెంచుకోవడం వల్ల ఇండోర్ గాలి కలుషితాలను తొలగించవచ్చని సూచించింది.
గాలిలో ఎక్కువగా కేంద్రీకృతమైన టాక్సిన్స్‌ను తొలగించడంలో మొక్కలు వేగంగా, మరింత ప్రభావవంతంగా మారాయి. టాక్సిన్స్ పెరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయని తెలిపింది ఈ అధ్యయనం. ఎనిమిది గంటలలోపు ఇండోర్ ఎయిర్ నుంచి బెంజీన్ వంటి క్యాన్సర్ కారక సమ్మేళనాలతో సహా 97% విషపూరిత గ్యాసోలిన్ పొగలను సమర్థవంతంగా తొలగిస్తున్న ఇండోర్ ప్లాంట్స్.. ఆరోగ్యం, శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని కలిగిస్తూ ఉత్పాదకతను పెంచుతున్నాయని వివరించింది.