- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్‌కు రూ.1337 కోట్ల జరిమానా.. డామినెంట్ పొజిషన్ దుర్వినియోగంపై..
దిశ, ఫీచర్స్ : గూగుల్‌కు యాంటీ-ట్రస్ట్ కష్టాలు కొనసాగుతున్నాయి. 'యాంటీ కాంపిటీటివ్ ప్రాక్టీసెస్‌కు పాల్పడటంతో పాటు దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందున భారతదేశంలో ఈ టెక్ దిగ్గజానికి రూ. 1,337 కోట్ల జరిమానా విధించబడింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైస్ ఎకో సిస్టమ్‌లోని పలు మార్కెట్లలో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసినందుకే ఈ జరిమానా విధించినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గురువారం ట్వీట్ చేసింది.
మొబైల్ డివైసెస్‌లో ఉపయోగించే 'ఆండ్రాయిడ్ ఓఎస్' సృష్టికర్త, నిర్వాహకుడు 'గూగుల్'. ఇది ఆండ్రాయిడ్ యాజమాన్య అప్లికేషన్స్‌కు కూడా బాధ్యత వహిస్తుంది. ఇక OEMs(డివైస్‌ల అసలు తయారీదారులు) తమ పరికరాల్లో ఆండ్రాయిడ్ ఓఎస్, గూగుల్ యాప్స్ ఉపయోగిస్తాయి. ఈ హక్కులన్నీ మొబైల్ అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్(MADA) ద్వారా నిర్వహించబడతాయి. ఈ మేరకు ప్రముఖ సెర్చ్ ఎంట్రీ పాయింట్స్.. అంటే 'సెర్చ్ యాప్, విడ్జెట్, క్రోమ్ బ్రౌజర్స్' ఆండ్రాయిడ్ పరికరాల్లో ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయని MADA హామీనిచ్చింది. ఈ చర్య దాని పోటీదారుల కంటే గూగుల్ సెర్చ్ సేవలకు గణనీయ పోటీతత్వం ఇచ్చిందని CCI ఒక ప్రకటనలో తెలిపింది.
'ఇంకా, ఆండ్రాయిడ్ పరికరాల్లో దాని మరొక ఆదాయాన్ని ఆర్జించే యూట్యూబ్ యాప్‌కు సంబంధించి, గూగుల్ దాని పోటీదారులపై గణనీయమైన పోటీని సాధించింది. అయితే ఈ తరహా సేవల పోటీదారులు.. MADA ద్వారా గూగుల్ పొందినటువంటి సురక్షిత, ఎంబెడెడ్ మార్కెట్ యాక్సెస్‌ను ఎప్పటికీ పొందలేరు. ఇది గూగుల్ పోటీదారులను సంబంధిత మార్కెట్‌లలోకి ప్రవేశించడానికి లేదా ఆపరేట్ చేయడానికి గణనీయమైన ప్రవేశ అడ్డంకులను సృష్టించింది' అని CCI జోడించింది.
గూగుల్ తనను తాను సేవ్ చేసుకునేందుకు ప్రయత్నించిందా?
CCI ప్రకారం, యాపిల్ నుంచి ఉత్పన్నమయ్యే పోటీ పరిమితులను సూచించడం ద్వారా గూగుల్ తనకు తానుగా కేసు పెట్టడానికి ప్రయత్నించింది. అయితే యాపిల్, గూగుల్ రెండు వేర్వేరు వ్యాపార నమూనాలను కలిగి ఉన్నాయని CCI తెలిపింది. యాపిల్.. స్మార్ట్ డివైస్‌ల విక్రయానికి ప్రాధాన్యతనిచ్చే వర్టికల్ ఎకోసిస్టమ్‌పై ఆధారపడి ఉంటుందని CCI తెలిపింది. మరోవైపు గూగుల్ వ్యాపారం దాని ప్లాట్‌ఫామ్స్‌లో వినియోగదారులను పెంచే అంతిమ ఉద్దేశ్యంతో నడపబడుతుందని CCI పేర్కొంది. తద్వారా వారు దాని ఆదాయ ఆర్జన సేవ అయిన ఆన్‌లైన్ సెర్చింగ్‌తో ఇంటరాక్ట్ అవుతారు. ఇది గూగుల్ ద్వారా ఆన్‌లైన్ ప్రకటనల సేవల విక్రయాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందని తెలిపింది.
గూగుల్ వంటి టెక్ దిగ్గజాల పద్ధతులు చిన్న వ్యాపారాలు, అభివృద్ధి చెందుతున్న సేవలకు ఎలా హాని కలిగిస్తాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాంటీ-ట్రస్ట్ సంస్థలు ఒక కన్నేసి ఉంచుతున్నాయి. సెర్చ్ బ్రౌజర్ సహా దాని సేవలను ఉపయోగించడం ద్వారా గూగుల్ చిన్న పోటీదారులు అందించే సారూప్య పరిష్కారాల కంటే దాని సొంత ఉత్పత్తులు, సేవలకు సులభంగా ప్రాధాన్యతనిస్తుంది. క్రమంగా ఇది పోటీకి హాని కలిగించవచ్చు.