Good Pressure : ఒత్తిడి ఒకింత మంచిదే.. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా?

by Javid Pasha |
Good Pressure : ఒత్తిడి ఒకింత మంచిదే.. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగానే ఒత్తిడికి గురికావడం వివిధ అనారోగ్యాలతో ముడిపడి ఉంటుంది. పైగా అది ఎక్కువైతే యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక రుగ్మతలకు, క్రమంగా శారీరక అనారోగ్యాలకు కారణం కావచ్చు. కానీ ఇదంతా బ్యాడ్ స్ట్రెస్ వల్ల మాత్రమే జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అంటే మనల్ని మానసికంగా కృంగదీసేవి, దీర్ఘకాలం పాటు బాధను కలిగించే వాటిని చెడు ప్రభావం చూపే ఒత్తిళ్లుగా పేర్కొంటారు. అయితే నిత్య జీవితంలోని సాధారణ ఒత్తిళ్లు మాత్రం అందుకు భిన్నం. పైగా వీటివల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అందుకే గుడ్ స్ట్రెస్ లేదా గుడ్ ప్రెరజర్స్‌గా పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం.

గుడ్ ప్రెజర్ అంటే ?

మానసిక నిపుణుల ప్రకారం మంచి ఒత్తిడి మనిషికి మేలు చేస్తుంది. అలర్ట్ నెస్ పెంచుతుంది. దీనిని యూస్ట్రెస్ అని కూడా పిలుస్తారు. క్యూరియాసిటీ, అనుకోని సంఘటనలు, అనూహ్య పరిణామాలు, ప్రమాదాలు వంటివి జరిగినప్పుడు కూడా మనం ఒత్తిడికి గురవుతుంటాం. కానీ ఈ ఒత్తిడి మన శరీరంలో ఆపద నుంచి బయటపడే కెమికల్ రియాక్షన్స్‌ను ప్రేరేపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే గనుక లేకపోతే వివిధ సందర్భాల్లో నష్టపోతాం.

మంచి ఒత్తిడి వల్ల ప్రయోజనాలు

* గుడ్ ప్రెజర్ నిజానికి మనలో ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ రియాక్షన్‌ను ప్రేరేపించడం ద్వారా ఇబ్బందుల నుంచి బయడపడేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల మెమోరీ పవర్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు స్టూడెంట్స్ స్ట్రెస్‌కు గురవుతారు. కానీ అది వాళ్లు ఇంకా బాగా చదువుకునేలా ప్రేరేపిస్తుంది. జ్ఞాపక శక్తి పెరగడానికి పరోక్షంగా కారణం అవుతుంది.

* అలాగే వర్క్‌ప్లేస్‌లో కూడా కొందరు గుడ్ ప్రెజర్‌కు గురవుతుంటారు. ఉదాహరణకు కొత్త ప్రాజెక్టును ఒప్పుకోవడం, వర్క్ పూర్తి చేయడం, పనిలో కొత్త మార్పులు వంటివి కొత్త నైపుణ్యాలను నేర్చుకునేలా ప్రేరేపిస్తాయి. తర్వాత మానసిక సంతృప్తికి కారణం అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

* మనలో టాలెంట్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు రొటీన్‌గా వ్యవహరిస్తుంటాం. అలాంటప్పుడు గుడ్ ప్రెజర్.. మనల్ని బెటర్‌గా తీర్చిదిద్దుతుంది. ఒత్తిడి పెరగడం కారణంగా కొత్త విషయాలను స్టడీ చేయడం, స్కిల్స్ అలవర్చుకోవడం వంటివి చేస్తాం. దీంతో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

* అలాగే పొద్దున్న లేవడానికి బద్దకంగా అనిపిస్తుంది. పేరెంట్స్ పిల్లలను నిద్రలేపడం, వారికి వివిధ పనులు చెప్పడం వంటివి ఒత్తిడిలా అనిపించవచ్చు. ఈ ఒత్తిడి ప్రయోజనాలను కలిగిస్తుంది. అలాగే ఇబ్బందిగా అనిపించినా రోజూ వ్యాయామం చేయడం, ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోవడం కూడా గుడ్ ప్రెజర్‌లో భాగంగా కొనసాగుతుంటాయి. ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితికి మారడంలో, వర్క్ పరంగా ప్రొడక్టివిటీ పెంచడంలో సహాయపడటం ద్వారా మంచి ఒత్తిడి ఇంకా అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story